Nandini: ప్రపంచంలోనే 19 ఏళ్లకే CA.. గిన్నిస్ లో స్థానం.. ఆమె స్కూల్ లైఫ్ ఎలా ఉందంటే..?
19 ఏళ్ల వయసులో నందిని అగర్వాల్ రికార్డ్ సాధించింది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కిరీటం కైవసం చేసుకుంది. పాఠశాల విద్యలో కూడా రెండు క్లాస్‌లు జంప్ చేసి.., 13 సంవత్సరాలకే 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ రాసింది.. 15 ఏళ్ల వయసులో 12వ తరగతి పాసైంది. నందిని అగర్వాల్ ది మధ్యప్రదేశ్‌లోని మొరెనా అనే చిన్న పట్టణం.. 2021లో జరిగిన సీఏ ఫైనల్స్‌లో నందిని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
19 ఏళ్ల వయసులో నందిని అగర్వాల్ రికార్డ్ సాధించింది. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కిరీటం కైవసం చేసుకుంది. పాఠశాల విద్యలో కూడా రెండు క్లాస్‌లు జంప్ చేసి.., 13 సంవత్సరాలకే 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ రాసింది.. 15 ఏళ్ల వయసులో 12వ తరగతి పాసైంది. నందిని అగర్వాల్ ది మధ్యప్రదేశ్‌లోని మొరెనా అనే చిన్న పట్టణం.. 2021లో జరిగిన సీఏ ఫైనల్స్‌లో నందిని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 13 సెప్టెంబర్ 2021 నాటికి ఆమె ఈ ఫీట్ సాధించినప్పుడు ఆమె వయస్సు 19 సంవత్సరాల 330 రోజులు. నందిని 11వ తరగతిలో ఉన్నప్పుడు తను గిన్నిస్ రికార్డు సాధించాలని కలలు కంటూ ఉండేది. దానికోసమే నందిని సి.ఎ. పరీక్షపై మనసు పెట్టింది. నందిని, ఆమె అన్నయ్య సచిన్ విక్టర్ కాన్వెంట్ స్కూల్‌లో కలిసే చదువుకున్నారు. నందిని సోదరుడు సచిన్ కూడా CA పరీక్షలో 18వ ర్యాంక్ సాధించాడు. తన విజయంలో అన్నయ్య చాలా కీలక పాత్ర పోషించాడని నందిని చెప్పింది.. తనకు మాక్ టెస్ట్‌లలో మార్కులు సరిగా వచ్చేవి కాదని..అది తనను నిరాశపరిచిందని చెప్పింది. మాక్ ఎగ్జామ్‌లోనే ఇలాంటి మార్కులు వస్తే అసలు పరీక్షలో ఎలా రాణిస్తానని భయం వేసేది అని చెప్పింది. కానీ, తన సోదరుడు తనకు ఎంతగానో సపోర్ట్ చేసినట్టుగా చెప్పింది. మాక్ టెస్ట్ రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండమని తనను అన్నయ్య ఎప్పుడూ ప్రోత్సహించేవాడని చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..