Viral: మహిళపై టీటీఈ దురుసు ప్రవర్తన.. రన్నింగ్‌ ట్రైన్‌లో నుంచి మహిళను తోసేసిన టీటీఈ.

Viral: మహిళపై టీటీఈ దురుసు ప్రవర్తన.. రన్నింగ్‌ ట్రైన్‌లో నుంచి మహిళను తోసేసిన టీటీఈ.

Anil kumar poka

|

Updated on: Sep 04, 2023 | 12:44 PM

నడుస్తున్న రైల్లోనుంచి ఓ మహిళా ప్రయాణికురాలిని రైల్వే టీటీఈ తోసేసిన అమానవీయ ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్కలో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయానీకురాలితో టీటీ దురుసుగా ప్రవర్తించాడు. అంతే కాదు.. కదులుతున్న రైలులో నుంచి కిందకు తోసేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళా ప్రయాణికురాలు తిరుపతి నుంచి కడపకు వెళ్లేందుకు జనరల్ బోగీలో ఎక్కాల్సి ఉంది.

నడుస్తున్న రైల్లోనుంచి ఓ మహిళా ప్రయాణికురాలిని రైల్వే టీటీఈ తోసేసిన అమానవీయ ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్కలో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయానీకురాలితో టీటీ దురుసుగా ప్రవర్తించాడు. అంతే కాదు.. కదులుతున్న రైలులో నుంచి కిందకు తోసేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళా ప్రయాణికురాలు తిరుపతి నుంచి కడపకు వెళ్లేందుకు జనరల్ బోగీలో ఎక్కాల్సి ఉంది. అయితే తిరుపతిలో రైలు కదలడంతో ఆమె అందుబాటులో ఉన్న రిజర్వేషన్ బోగీలో ఎక్కింది. అయితే టీటీఈ రాజంపేటలో ఆమె రిజర్వేషన్ బోగీలో ఎక్కి ఉండటాన్ని ఒప్పుకోకుండా కిందికి తోసేసినట్లు బాధితురాలి బంధువులంటున్నారు. మహిళ ప్లాట్ ఫాంకు – రైలుకు మధ్యలో పడి గాయలపాలైంది. విషయం డ్రైవర్ కు తెలియడంతో రైలు ను నిలిపి వేసినట్లు తెలిసింది. అనంతరం సదరు ప్రయానికురాలిని బంధువులు హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. గాయపడ్డ మహిళా ప్రయాణికురాలు నడుము విరిగినట్లు బంధువులు తెలిపారు. పొరపాటున ఎక్కామని టిటీఈ ని ఎంత వేడుకున్నా కనికరించకపోగా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడని తోటి ప్రయాణికులు తెలిపారు. టిటీఈపై ప్రయాణికులు దాడి చేస్తారేమోనని భావించి, రాయలసీమ ఎక్స్ప్రెస్ ను సిగ్నల్ ఇచ్చి తొందరగా పంపించేశారు. ఈ సంఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..