Peacock Fire: నోటి నుంచి నిప్పులు కక్కుతున్న నెమలి.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

Peacock Fire: నోటి నుంచి నిప్పులు కక్కుతున్న నెమలి.. వీడియో చూస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

Anil kumar poka

|

Updated on: Sep 04, 2023 | 9:56 AM

నెమళ్లు ప్రపంచంలోని అత్యంత అందమైన జీవులు. వర్షాకాలంలో నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆ సొగసు చూడతరమా అనిపిస్తుంది. అలాంటి నెమలి.. ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే. నెమలి తన నోటి వెంట నిప్పులు కురిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు సైతం భయంతో వణికిపోతున్నారు.

నెమళ్లు ప్రపంచంలోని అత్యంత అందమైన జీవులు. వర్షాకాలంలో నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆ సొగసు చూడతరమా అనిపిస్తుంది. అలాంటి నెమలి.. ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే. నెమలి తన నోటి వెంట నిప్పులు కురిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు సైతం భయంతో వణికిపోతున్నారు. వీడియోలో నెమలి పైకి చూస్తూ బిగ్గరగా అరుస్తుండగా దాని నోటి నుండి మంటలు వస్తున్నాయి. కానీ, నెమలి నిజానికి కక్కటం లేదు. అది అరుస్తున్నప్పుడు సూర్యకాంతి వల్ల ఇలాంటి దృశ్యం ఆవిష్కృతం అయింది. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న వీడియోలో కనిపించే నెమలి చాలా చలి ప్రదేశంలో ఉన్నట్లుంది. అలా ఊపిరి పీల్చుకున్నప్పుడు హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టుగా నోటి నుంచి పొగ రావటం కనిపించింది. అందులో సూర్యుని కాంతి ఎర్రటి నిప్పులా కనిపించింది. ఈ ప్రకృతి అందాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సూర్యకాంతి కారణంగా నెమలి నోటి నుంచి నిప్పులు విరజిమ్మే వీడియో 12 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. కొద్ది రోజుల క్రితం నెమలి ఆకాశంలో ఎగురుతున్న వీడియో వైరల్‌గా మారింది. అలా నెమలి ఆకాశంలో ఎగురుతున్నవీడియో చూసి వీక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. లైక్‌లు, షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..