Telangana: అరుదైన రెండు తలల కొబ్బరి చెట్టు.. చూసేందుకు ఎగబడుతున్న జనం..!
సృష్టిలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనుషులకు జంతువులను పోలిన శిశువులు జన్మించడం, జంతువులకు మనుషులను పోలిన పిల్లలు పుట్టడం చూస్తుంటాం. ఇదంతా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అలా జరుగుతుందని అనుకుంటాం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది.

సృష్టిలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనుషులకు జంతువులను పోలిన శిశువులు జన్మించడం, జంతువులకు మనుషులను పోలిన పిల్లలు పుట్టడం చూస్తుంటాం. ఇదంతా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అలా జరుగుతుందని అనుకుంటాం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా కొబ్బరిచెట్టుకు ఒకటే తల ఉంటుంది. కొమ్మలు ఉండవు ఈ విషయం అందరికీ తెలిసిందే..! అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొబ్బరిచెట్టుకు రెండు తలలు ఉన్నాయి. రెండూ చక్కగా పచ్చని ఆకులతో కాయలతో కళకళలాడుతోంది. ఈ చెట్టును ఆశ్చర్యంగా చూస్తున్నారు జనం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోని గిరిజన బాలికల ఆశ్రమం పాఠశాలలో అరుదైన రెండు తలల కొబ్బరి చెట్టు సందడి చేస్తోంది. ఈ కొబ్బరి చెట్టు వేసినప్పుడు ఒక తలతోనే ఉందని, చెట్టు కొంత పెద్దదైన తర్వాత రెండుగా చీలి మరో తల ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. పాఠశాలలో పిల్లలు మాత్రం మా స్కూల్లో కొబ్బరి చెట్టుకు రెండు తలకాయలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో కొత్తగా జాయిన్ అయిన పిల్లలకు అక్కడ విద్యార్థులు ఈ అరుదైన చెట్టును గొప్పగా చూపిస్తుంటారు.
ఇలా కొబ్బరి చెట్లకు చాలా అరుదుగా రెండు తలలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. జన్యు సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు లేదా వాతావరణంలో మార్పులు వచ్చి ఉరుములు, పిడుగులు పడిన సందర్భాల్లో రెండుగా ఏర్పడుతుంటాయని అంటున్నారు. చెట్టు పెరిగే క్రమంలో అతి శీతల పరిస్థితుల్లో కాండం రెండుగా చీలి రెండు తలలు రావచ్చని,లేదా కొబ్బరి మొక్క వేసిన నేలలో అధిక పోషకాలు ఉండటం కూడా ఈ రెండు తలలు ఎదుగుదలకు కారణం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
