MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలి…?.. ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర నుంచి ట్వీట్..
దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటములకు పోటీగా.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఇతర రాష్ట్రాల నుంచీ మద్దతు పెరుగుతోంది. తెలంగాణలోని ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నిర్వహించిన తర్వాత.. తొలిసారిగా..

దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటములకు పోటీగా.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఇతర రాష్ట్రాల నుంచీ మద్దతు పెరుగుతోంది. తెలంగాణలోని ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నిర్వహించిన తర్వాత.. తొలిసారిగా మహారాష్ట్రలోని నాందేడ్ లో భారీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ సూపర్ సక్సెస్ అయింది. అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా జాయిన్ అవ్వాలంటూ మహారాష్ట్ర నుంచి ఓ వ్యక్తి.. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
తెలంగాణ మాదిరిగా దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఏర్పడాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. దేశవ్యాప్తంగా ప్రజానీకం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులవుతున్నారడానికి సాగర్ నిదర్శనం. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాందేడ్ లో నిర్వహించిన బహిరంగ సమావేశం మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపింది. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష. కేసీఆర్ తోనే సాధ్యమనే నమ్మకం వారిలో ఉంది.




– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
Sagar Ji, you can support our leader and Hon’ble CM KCR Garu and @BRSparty by joining us in our public meetings and programs across the country.
DM your contact details. We are happy to welcome you ? #AbkiBaarKisaanSarkar https://t.co/TnBdaB8r6D
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 20, 2023
కాగా.. ఈ నెల 25న మహారాష్ట్రలోని ముంబయిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ‘2024 ఎన్నికలు – విపక్షాల వ్యూహం’ అనే అంశంపై చర్చ జరుగనున్నది. ఈ చర్చా వేదికలో కవిత పాల్గొని, అభిప్రాయం వ్యక్తం చేయనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యతను తెలియజేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం