Telangana: వైఎస్ షర్మిల పాదయాత్ర మళ్లీ మొదలవుతుందా?.. పోలీసులు ఏం రిపోర్ట్ ఇవ్వబోతున్నారు?.
వైఎస్ షర్మిల పాదయాత్ర మళ్లీ మొదలవుతుందా? లేదా?. ఇప్పటికే అనేకసార్లు పర్మిషన్ రద్దు చేసిన పోలీసులు మరోసారి అనుమతి ఇస్తారా?. కోర్టు అనుమతిచ్చినా పాదయాత్రను అడ్డుకుంటున్నారంటోన్న షర్మిల ఏం చేయబోతున్నారు?. ఈసారి కోర్టుకు షర్మిల ఏం చెబుతారు!. పోలీసులు ఏం రిపోర్ట్ ఇవ్వబోతున్నారు?.

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై చేసిన హాట్ కామెంట్స్‌తో ఈసారి షర్మిల యాత్రకు బ్రేక్‌పడింది. అంతేకాదు, రెండోసారి షర్మిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గతంలో ఆందోల్ ఎమ్మెల్యేపై చేసిన కామెంట్స్‌తో అట్రాసిటీ నమోదుకాగా, ఇప్పుడు ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై కించపర్చే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు రావడంతో మరోసారి ఎస్సీఎస్టీ కేసు నమోదైంది. మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు షర్మిల. నేను రాజశేఖర్‌రెడ్డి బిడ్డను ఎవ్వరికీ భయపడేదేలే అంటూ బీఆర్‌ఎస్ లీడర్లపై నిప్పులు కురిపిస్తున్నారు. పాదయాత్ర మొదలు పెట్టినప్పట్నుంచీ అదే దూకుడు, అదే టెంపో. ఏ నియోజకవర్గం ఏదైనా, ఎమ్మెల్యే ఎవరైనాసరే తగ్గేదే లేదంటూ విరుచుకుపడుతున్నారు. ఆ వాడివేడి మాటలే షర్మిల పాదయాత్రకు పదేపదే బ్రేకులు పడేలా చేస్తున్నాయ్.
బీఆర్‌ఎస్ కార్యకర్తలు, శంకర్‌నాయక్ అనుచరుల ఆందోళనతో మహబూబాబాద్ అట్టుడికిపోయింది. శంకర్‌నాయక్‌కు వెంటనే షర్మిల క్షమాపణ చెప్పాలంటూ వేలాది మంది రోడ్డుపైకొచ్చి నిరసన తెలిపారు. YSRTP ఫ్లెక్సీలు, కటౌట్లను ధ్వంసంచేసి హైటెన్షన్ పుట్టించారు. నన్నేవరూ భయపెట్టలేరంటున్నారు వైఎస్ షర్మిల. మాటకి మాట, యాక్షన్‌కి రియాక్షన్ కచ్చితంగా ఉంటుందని తెగేసి చెప్పారు. మళ్లీ కోర్టుకెళ్లి పాదయాత్ర మొదలుపెడతానని అంటున్నారు షర్మిల.
ఒకవైపు వైఎస్ షర్మిల, మరోవైపు బీఆర్ఎస్ లీడర్స్. ఇరువైపులా ఎవ్వరూ తగ్గట్టే!. దాంతో, షర్మిల ఎక్కడకెళ్తే అక్కడ హైవోల్టేజ్ సీన్స్, రచ్చరచ్చే జరుగుతోంది. మీరొకటంటే నేను అంతకుమించి అంటానని షర్మిల అంటుంటే… ఓ మహిళ మాట్లాడాల్సిన మాటలేనా అంటున్నారు బీఆర్‌ఎస్ లీడర్స్. మరి, షర్మిల వర్సెస్ బీఆర్ఎస్ లీడర్స్‌గా సాగుతోన్న ఈ హైవోల్టేజ్ వార్…ముందుముందు ఇంకెంత రచ్చ సృష్టిస్తుందో? చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం