AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే ఖాళీ బూడిదైన పలు కార్లు..!

హైదరాబాద్‌ మహానగరంలోని అత్తాపూర్‌లో కార్ల సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో ఉన్నట్టుండి మంటలు పెద్ద ఎత్తున చెలరేగి పలు కార్లు తగలబడ్డాయి. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు మంటలను గమనించి ఫైర్ స్టేషన్‌కి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో ఫైర్‌ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది.

Hyderabad: కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే ఖాళీ బూడిదైన పలు కార్లు..!
Hyderabad Fire Accident
Sravan Kumar B
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 7:28 AM

Share

హైదరాబాద్‌ మహానగరంలోని అత్తాపూర్‌లో కార్ల సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో ఉన్నట్టుండి మంటలు పెద్ద ఎత్తున చెలరేగి పలు కార్లు తగలబడ్డాయి. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు మంటలను గమనించి ఫైర్ స్టేషన్‌కి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో ఫైర్‌ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి సర్వీస్ సెంటర్‌ నిర్వాహకుల అలసత్వమే కారణమని స్థానికులు చెప్తున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసి ఉంటారని యజమానులు ఆరోపిస్తున్నారు.

అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 185 వద్ద ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్స్ సుజుకి కార్ల షోరూంలో అర్థరాత్రి 1:20 నిమిషాల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో షోరూంలో సుమారు 50 నుంచి 70 కార్లు ఉన్నాయి. అయితే షోరూం సర్వీస్ సెంటర్ లో ఉన్న స్క్రాప్ గోదాంలో మంటల అంటుకున్నాయి. మంటలు భారీ ఎత్తున వ్యాపించి సుమారు ఐదు కార్లు తగలబడ్డాయి. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు మంటలను గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక సిబ్బంది రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి షో రూమ్ నిర్వాహకుల అలసత్వమే కారణమని, వేస్ట్ ఆయిల్స్ బ్యాటరీలు అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టడంతో ప్రమాదం సంబంధించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పని చేసి ఉంటారని షోరూం నిర్వాహకులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..