Hyderabad: అమానుషం.. ఇంటి ముందు తెలియక చేసిన పనికి.. వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాదారు..!

మనుషుల్లో మానవత్వం రోజు రోజుకీ మంటగలుస్తోంది. తప్పు చేస్తే శిక్షించే అధికారం కూడా వాళ్లే తీసుకుంటున్నారు. ఒక్కోసారి అది హద్దులు దాటి ఒకరిని ఒకరు చంపుకునే వరకూ వెళ్తోంది. ఇక్కడ కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది

Hyderabad: అమానుషం.. ఇంటి ముందు తెలియక చేసిన పనికి.. వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాదారు..!
Hyderabad Attack
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Balaraju Goud

Updated on: Sep 25, 2024 | 6:11 PM

మనుషుల్లో మానవత్వం రోజు రోజుకీ మంటగలుస్తోంది. తప్పు చేస్తే శిక్షించే అధికారం కూడా వాళ్లే తీసుకుంటున్నారు. ఒక్కోసారి అది హద్దులు దాటి ఒకరిని ఒకరు చంపుకునే వరకూ వెళ్తోంది. ఇక్కడ కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇంటి ముందు మూత్రం పోశాడన్న కారణంతో ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మేడ్చల్ జిల్లా సెంటర్ అల్వాల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డి కాలనీలో జరిగిన ఈ దుర్మార్గమైన ఘటనఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తమ ఇంటి ముందు మూత్రం పోశాడనే నెపంతో అదే కాలనీలోనే ఉండే ఇద్దరు వ్యక్తుల మధ్య రాద్ధాంతం చోటు చేసుకుంది. అయితే గొడవకు ఎవరైతే దిగారో.. ఆ వ్యక్తి ఫోన్ చేసి మరీ బోయిన్‌పల్లి ప్రాంతం నుంచి మరో ఇద్దరిని పిలిపించాడు. అనంతరం ,మూత్రం పోశాడని ఆరోపణలు ఉన్న వ్యక్తి మీద విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ దాడి చేసినవారిలో ఒకరు రౌడీషీటర్ అని తెలుస్తోంది. నడిరోడ్డుపైనే వ్యక్తిని కింద పడేసి ఇష్టం వచ్చినట్లు పెద్ద పెద్ద కర్రలతో చితకబాదారు. అతను తీవ్ర గాయాలతో గట్టిగట్టిగా అరుస్తున్నా ఆపకుండా కొడుతూనే ఉన్నారు. దాడి చేస్తున్న వ్యక్తులను ఓ మహిళ వారిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆగి.. ఆగి మరీ ఆ వ్యక్తిని కింద నుంచి లేవనీయకుండా కర్రలతో చితకబాదారు. తల మీద కర్రతో గట్టిగా కొడుతూ ఉంటే బాధితుడు విలవిలలాడిపోయాడు.

వీడియో చూడండి..

ఈ ఘటన జరిగింది రాత్రి సమయంలో కావడం వల్ల అక్కడ ఇతరులు ఎవరూ పెద్దగా కనిపించలేదు. చూస్తున్న ఆ కొందరు కూడా వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం బాధితుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా నిందితులపై పోలీసులు చర్యలు చేపట్టారు. హత్యాయత్నంగా పరిగణించి దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల