AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యాపేట జిల్లాలో సినిమాను తలపించిన సీన్.. గాల్లో ఎగిరి కాలువ దాటిన లారీ! ఆశ్చర్యపోయిన జనం!

సాధారణంగా వాహనాలు గాళ్లో ఎగురుతూ దూసుకెళ్లడం మనం సినిమాల్లో చూస్తుంటాం, ఇవన్నీ సినిమాల్లోనే సాధ్యం అనుకుంటాం. కానీ ఇలాంటి సీన్‌లు మన నిజ జీవితంతో కనిపిస్తే ఆశ్చర్యపోతాం. అయితే ఇక్కడ కొందరు వ్యక్తులకు కూడా అదే అనుభవం ఎదురైంది. అచ్చం సినిమాలో మాదిరిగానే భారీ లోడ్‌తో ఉన్న ఓ లారీ ఏకంగా పది అడుగుల వెడల్పున్న కాల్వను గాల్లో ఎగిరి దాటేసింది. ఇది చూసిన అక్కడున్న స్థానికులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

సూర్యాపేట జిల్లాలో సినిమాను తలపించిన సీన్.. గాల్లో ఎగిరి కాలువ దాటిన లారీ! ఆశ్చర్యపోయిన జనం!
Suryapet
Anand T
|

Updated on: Jun 17, 2025 | 10:22 PM

Share

సాధారణంగా వాహనాలు గాళ్లో ఎగురుతూ దూసుకెళ్లడం మనం సినిమాల్లో చూస్తుంటాం, ఇవన్నీ సినిమాల్లోనే సాధ్యం అనుకుంటాం. కానీ ఇలాంటి సీన్‌లు మన నిజ జీవితంతో కనిపిస్తే ఆశ్చర్యపోతాం. అయితే సూర్యాపేట జిల్లాలో నిజంగానే సినిమాను తలపించే సీన్‌ కనిపించింది. భారీలోడ్‌తో ఉన్న ఓ లారీ పది అడుగుల వెడల్పున్న కాల్వను గాల్లో ఎగిరి దాటేసింది. వివరాళ్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని ఒక ఫ్యాక్టరీ నుండి ఓ లారీ సిమెంట్ సంచులను లోడ్ చేసుకుని కోదాడ వైపుగా వెళ్తుంది. అయితే మార్గమధ్యలో కందిబండ సమీపంలో ఒక కొత్త వంతెన నిర్మాణంలో ఉంది. అయితే దీనికి ముందుగానే కొద్ది దూరంలో అధికారులు డైవర్షన్ బోర్డును ఏర్పాటు చేశారు. అయితే రాత్రి సమయం కావడంతో అది గమనించిన లారీ డ్రైవర్‌ రోడ్డుపై ఉన్న మట్టిదిబ్బలను దాటుకుంటూ వేగంగా ముందుకు దూసుకెళ్లాడు.

అయితే రహదారిపై వంతెన నిర్మాణ ప్రాంతానికి ముందు బాగంలో ఎగువ నుంచి వచ్చే వాగు నీటిని మళ్లించేందుకు అధికారులు రోడ్డును తవ్వి ఓ కాల్వ తీశారు. ఈ కాల్వ సుమారు 10 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతు ఉంటుంది. అయితే అప్పటికే వేగంగా వస్తున్న లారీ డ్రైవర్ దగ్గరకు వచ్చాక అక్కడ కాలువ ఉందని గమనించాడు. అప్పుడు బ్రేక్‌ వేస్తే లారీ అదుపుతప్పి ప్రమాదం జరిగే పరిస్థితి ఉండడంతో చేసేదేమి లేక, వేగాన్ని మరింత పెంచాడు. దీంతో ఫుల్‌ స్పీడ్‌లో ఉన్న లారీ ఎగిరి కాలువ అవతల వైపుకు దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో వాహనం టైర్ల బేస్‌లు, క్యాంబర్ ప్లేట్లు, డీజిల్ ట్యాంక్ దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ, డ్రైవర్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. అయితే లారీ గాల్లో ఎగిరి కాలువ దాటడాన్ని చూసి అక్కడి జనం అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. లారీ అలా ఎలా వెల్లిందబ్బా అని ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా లారీ కాలువ దాటడంతో పెను ప్రమాదం తప్పిందని.. అలా కాకుండా భారీ లోడ్‌తో ఉన్న లారీ అదుపుతప్పి కాలువలో పడి ఉంటే పెను ప్రమాదం జరిగిం ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..