వలలో చిక్కుకుని తల్లడిల్లిన పిల్ల కోతి.. తీసేందుకు యత్నించిన స్థానికులు.. ఇంతలోనే!
కోతుల గుంపు మామిడి చెట్టు ఎక్కింది. అందులో ఓ పిల్ల కోతి.. చెట్టుపై ఉన్న జాలిలో చిక్కుకుంది. ఆ జాలి నుంచి బయటపడలేక తల్లడిల్లిపోయింది. ఇది గమనించిన స్థానికులు.. జాలి నుంచి కోతిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. మిగతా కోతులు జనంపై దాడికి యత్నం చేశాయి. చివరికి చెట్టు నుంచి కిందకు దిగిన కోతి పిల్ల.. జాలితోనే చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది.

జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో శ్రీధర్ అనే వ్యక్తి ఇంట్లో మామిడి చెట్టు ఉంది. కోతుల గుంపు తరుచుగా ఈ చెట్టుపైన ఉంటాయి. గతంలో మామిడి కాయలు ఉన్న సందర్బంలో.. ఇక్కడే తిష్ట వేశాయి. ఈ క్రమంలో మామిడి కాయలు కోసం వినియోగించే జాలిలో చిక్కుకుంది. అయితే మొదట ఎంతకూ రాలేదు. చెట్టు కొమ్మకు చిక్కుకుంది. ఓ కర్ర సహాయంతో జాలిని తెంపే ప్రయత్నం చేశారు. కానీ.. మిగతా కోతులు కోతిని తీయనివ్వలేదు. కోతిని రక్షించడానికి వెళ్లినవారిపై కోతుల గుంపు దాడికి ప్రయత్నించాయి.
చివరికి అతి కష్టం మీద చెట్టు నుంచి జాలిని కిందకు తీశారు. కానీ కొంత జాలి కోతి చిక్కుకుపోయింది. ఎట్టకేలకు చెట్టు నుంచి కిందికి వచ్చింది. కానీ జాలితోనే కోతి ఉండిపోయింది.. కిందికి వచ్చిన తరువాత స్థానికులు తీసే ప్రయత్నం చేశారు.. కానీ.. కోతి నుంచి జాలి రాలేదు. మిగతా కోతుల గుంపు దాడి చేసందుకు యత్నించాయి. దీంతో అక్కడికి వెళ్లలేకపోయారు. తరువాత అక్కడి నుంచి కోతులు వెళ్లిపోయాయి.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..