Hyderabad Metro: సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన హైదరాబాద్ మెట్రో.. ఒక్కరోజులోనే 5 లక్షల మందికి పైగా ప్రయాణం
హైదరాబాద్‌లో ప్రొద్దున నుంచి రాత్రివరకు మెట్రోలో చూస్తే ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు వేగంగా. సులభంగా, సౌకర్యవంతంగా చేరుకునేందుకు మెట్రోలో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు.

హైదరాబాద్‌లో ప్రొద్దున నుంచి రాత్రివరకు మెట్రోలో చూస్తే ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. లక్షలాది మంది తమ గమ్యస్థానాలకు వేగంగా. సులభంగా, సౌకర్యవంతంగా చేరుకునేందుకు మెట్రోలో ప్రయాణించేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. జులై 3వ తేదిన మెట్రో రైళ్లలో దాదాపు 5 లక్షల 10 వేల మంది ప్రయాణించారు. మెట్రో ప్రారంభించినప్పటి నుంచి ఇంత భారీ స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. మరో విషయం ఏంటంటే ఈ ప్రయాణికుల్లో సగానికి పైగా నాగోల్ నుంచి హెటెక్ సిటీ, ఎల్బీనగర్ నుంచి కూకట్‌పల్లి రూట్లలోనే ప్రయాణించారు.
2017 నవంబర్ 29న హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభించారు. అప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు ఈ మెట్రో ప్రయాణాన్ని ఆదరిస్తున్నారు. రెండున్నర ఏళ్లలోనే రోజువారి ప్రయాణికుల సంఖ్య 4 లక్షలకు చేరింది. అయితే ఇప్పటివరకు మెట్రో దాదాపు 40 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ముఖ్యంగా ఆఫీస్ టైమింగ్స్‌లో ప్రయాణికలు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అమీర్‌పేట్ జంక్షన్ అయితే ఉదయం పూట, సాయంత్రం వేళ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. అలాగే ఉప్పల్, ఎల్బీనగర్ స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ ఉంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



