Ponguleti Srinivas Reddy: అవసరం అనుకుంటే సీఎం జగన్‌తోనూ విబేధిస్తా: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
అధిష్టానం ఏపీ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. పార్టీలో తనకు ఏ బాధ్యతలు అయినా..
అధిష్టానం ఏపీ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. పార్టీలో తనకు ఏ బాధ్యతలు అయినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానన్న పొంగులేటి.. అవసరమైతే సీఎం జగన్‌తోనూ విబేధిస్తానని అన్నారు. వ్యాపారాలకు, రాజకీయాలకు సంబంధం లేదు.. ఓడించడానికి కాంగ్రెస్‌కి నేను వెళ్లలేదని, అయితే ఎవరి కారణంగానో నేను బయటకు రాలేదని అన్నారు. బీఆర్‌ఎస్‌లో అధినేత సరిగ్గా లేడని అన్నారు. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాకు ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో అభివృద్ధి కోసం నాకు ఏ చిన్నపాటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్దితో చేస్తానని అన్నారు. నా స్వార్థం కంటే పార్టీ ఏం ఆదేశించినా అది తప్పకుండా చేస్తానని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి