Telangana: హస్కీ గొంతు విని ఆశపడ్డాడు.. పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. ఇచ్చిపడేసింది..!
ఒంటిమీద డ్రస్సులు మార్చినట్లు.. భర్తలను మార్చేస్తోంది ఆమె. సోషల్ మీడియాలో వేటాడి.. బకరాలను సెలెక్ట్ చేసుకుని పెళ్లిళ్లు చేసుకోవడం ఆమె హాబీ. చివరికి డబ్బు, నగలతో ఉండాయించడం ప్రొఫెషన్. అలాంటి నిత్యపెళ్లికూతురు స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఒంటిమీద డ్రస్సులు మార్చినట్లు.. భర్తలను మార్చేస్తోంది ఆమె. సోషల్ మీడియాలో వేటాడి.. బకరాలను సెలెక్ట్ చేసుకుని పెళ్లిళ్లు చేసుకోవడం ఆమె హాబీ. చివరికి డబ్బు, నగలతో ఉండాయించడం ప్రొఫెషన్. అలాంటి నిత్యపెళ్లికూతురు స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందరికీ పెళ్లంటే నూరేళ్ల పంట.. కొందరికి మాత్రం ఒళ్లు మంట.. ఎవరిష్టం వాళ్లది.. మ్యారేజెస్ మేడిన్ హెవన్ అంటారు. కానీ ఇది సైబర్ యుగం కదా.. స్మార్ట్‌ఫోన్ వేదికగా పెళ్లిళ్లవుతున్నాయి. అతన్ని ఆమెను ఓ ఫోన్ కాల్ కలిపింది. గొంతులో తేనే ఊరుతుందా! అన్నంత తియ్యని మాటలు. హస్కీ వాయిస్‌కు అతని గుండె జారి ఆమె ట్రాక్‌లో పడింది. ఫోన్ పే చర్చ.. వాట్సాప్, ఇన్‌స్టాలో చాటింగ్.. వీడియో కాలింగ్.. అలా అలా.. ముచ్చట పెళ్లి చేసుకుందాం.. రా! అనేంత వరకు వెళ్లింది.
ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. లగ్నకోటి రాసుకొని మరి దండలు మార్చుకున్నారు. లగ్గమైంది. కాపురం పెట్టారు. కథ మాంచి రంజు మీద సాగుతోన్న టైమ్‌లో ఒక్కసారిగా కిరికిరి. టచ్ మీ నాట్ అని హుకూం జారీ చేయడంతో గురుడి గుండె జారీ గల్లంతయింది. పెళ్లయిన మూడు నెలలు కూడా కాకుండానే ఎడమొఖంపెడ ముఖం. అలాగని కట్నకానుల లొల్లి వుందా అంటే అదీ లేదు. ఏమైందని ఆరా తీస్తే బదులు లేదు కదా.. ఏకంగా కటీఫ్ అనకుండానే అతనితో రిలేషన్‌ను కట్ చేసిందామె. పెట్టా బెడా సర్దకుని పుట్టింటికి వెళ్లింది. ఎంత బతిమాలినా ఊ లేదు.. ఊం ఊం లేదు.
పైగా బతిమాలడానికి వెళ్లిన భర్తపై అటాక్ చేయిందింట. అంతేకాదు తనకు ఉన్నఫళంగా రూ. 20 లక్షలు ఇవ్వాలని లేదంటే పర్సనల్ వీడియోలను వైరల్ చేస్తానంటూ బెదిరించిందట. అంతే పతి పరమేశ్వర్ షాకయ్యారు. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇలా చేస్తుందేంటి? అని డౌట్ ఫ్లాషయింది. ఎందుకైనా మంచిదని ఆమె ఫ్లాష్‌బ్యాక్‌పై ఫోకస్ చేశాడు. కూపీలాగితే తేరా నెంబర్ చార్ అనే డేటా వచ్చిందట. అదే ఆమెకు అతను నాలుగో భర్త. అల్రెడీ ముగ్గర్నీ పెళ్లి చేసుకోవడం.. ఆపై హ్యాండ్ ఇవ్వడం వంటివి జరిగాయనే షాకింగ్ నిజాలతో పాటు ఆమె గ్లాసోపాఖ్యానం.. మద్యం సేవనం మ్యాటర్ కూడా రివీలైందట. తనలా మరో 13 మందిని బకరాలను చేసి డబ్బు కాజేసిందనే డేటా కలెక్టర్ చేసి సరాసరి పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు రేవంత్‌ది పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రాంతం. ఆమెది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం. సోషల్ మీడియా ద్వారా జరిగిన పరిచయం ఇందాక వచ్చింది. ఇదీ ఆమె మోసాలపర్వం అంటూ ఫుల్ డేటా కలెక్ట్ చేసి పోలీసులకు అందించారు రేవంత్. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి ఆమ వెర్షన్ కూడా తెలియాలి కదా. అతనే 420 అనేది ఆమె ఆరోపణ. నమ్మించి మోసం చేశాడని.. తన దగ్గర గోల్డ్ చైన్ తీసుకున్నాడని.. ఆ విషయంలో గొడవ జరిగిందని వీడియో రిలీజ్ చేశారామె.
ఇష్టపడి పెళ్లి చేసుకన్నారు. మరి ఏడాది కూడా కాకముందే ఈ లొల్లి ఏంటి? వీళ్లిద్దరిలో ఎవరు నిజం? ఏది నిజం? మొత్తానికి కథ ఖాకీల దరికి చేరింది. నిజనిజాలేంటో ఇక ఖాకీల దర్యాప్తులో తేలాలి. బాధితుడి ఫిర్యాదుతో ఈ కేసు లోకల్‌గా హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..