కాలువ వద్ద స్నానం చెద్దామని భార్యను పిలిచాడు .. చివరికి ఊహించని ట్విస్ట్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో దారుణం జరిగింది. వరద కాలువ వద్ద స్నానం చెద్దామని తన భార్యను నమ్మించి అందులో తోసేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోరుట్ల పట్టణంలోని గంగంపేట గ్రామంలో అబ్దుల్ జామెర్ (28) కు జగిత్యాల పట్టణానికి చెందిన సాజిదాబేగం(21) తో సంవత్సరం క్రితమే పెళ్లి జరిగింది.

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో దారుణం జరిగింది. వరద కాలువ వద్ద స్నానం చెద్దామని తన భార్యను నమ్మించి అందులో తోసేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కోరుట్ల పట్టణంలోని గంగంపేట గ్రామంలో అబ్దుల్ జామెర్ (28) కు జగిత్యాల పట్టణానికి చెందిన సాజిదాబేగం(21) తో సంవత్సరం క్రితమే పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. సోమవారం రోజున ఉదయం అబ్దుల్ తన తల్లికి ఫోన్ చేశాడు. తన భార్యను కోరుట్లలో జగిత్యాల బస్సు ఎక్కించాలని ఆమెకు చెప్పాడు.
అయితే కూతురు జగిత్యాలకు చేరుకోకపోవడంతో అల్లడుపై అనుమానం వచ్చింది. దీంతో కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అలాగే జగిత్యాల బస్టాండ్‌లో సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలించారు. అయితే ఆ భార్యభర్తలు బస్టాండ్‌కు రాలేదని నిర్ధారించారు. ఇక భర్త అబ్దుల్ జామెర్‌పై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టాడు. తమదైన శైలిలో విచారించగా హత్య విషయం బయటపడింది. అబ్దుల్ తన భార్యకు కథలాపూర్ వరద కాలువలోకి తీసుకొచ్చానని.. ఆ తర్వాత ఆమెను అందులో తోసేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సాజిదాబేగం మృతదేహాన్ని బయటికి తీసి శవపరీక్షకు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..



