Telangana: సీన్ రిపీట్ అయితే ఊరుకునేదే లేదు.. శివాజీ విగ్రహ వివాదంపై చీకోటి ప్రవీణ్ వార్నింగ్..
చికోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. శివాజీ విగ్రహానికి అవమానం జరగడంపై తీవ్రంగా స్పందించారు. మరోసారి ఇలాంటి ఘటన రిపీట్ అయితే ఊరుకునేదేలేదంటూ వార్నింగ్ ఇచ్చారు చికోటి. చత్రపతి శివాజీ విగ్రహాం దగ్గర జరిగిన ఘటనను తప్పుబట్టారు.

చికోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. శివాజీ విగ్రహానికి అవమానం జరగడంపై తీవ్రంగా స్పందించారు. మరోసారి ఇలాంటి ఘటన రిపీట్ అయితే ఊరుకునేదేలేదంటూ వార్నింగ్ ఇచ్చారు చికోటి. చత్రపతి శివాజీ విగ్రహాం దగ్గర జరిగిన ఘటనను తప్పుబట్టారు. శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు చికోటి ప్రవీణ్. విగ్రహం వద్ద చెలరేగిన వివాదంలో గాయాల పాలైన సందీప్ అనే యువకుడిని పరామర్శించారు. మరోసారి ఇలాంటి దాడులు రిపీట్ అయితే చత్రపతి శివాజీ సాక్షిగా మేము ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. కామన్ గా మాకు ఓపిక ఎక్కువ ఇలా మాపై దాడులకు జరిగితే గాజులు వేసుకొని కూర్చోనే పరిస్ధితి లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంత అవమానం జరిగితే ఏ ఒక్క లీడర్ రాలేదు.. పట్టించుకోలేదంటూ తప్పుబట్టారు. శివాజీ విగ్రహం అవమానికి గురైతే మాట్లాడలేని నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఎవరైతే మద్దతు ఇస్తారో వారికే ఓటు వేయాలని మనవి చేశారు.
కాగా, ఓ వ్యక్తి మద్యం మత్తులో శివాజీ విగ్రహం ఎదుట మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో గజ్వేల్ ఒక్కసారిగా భగ్గుమంది. మ్యాటర్ తెలుసుకున్న హైందవులు శివాజీ విగ్రహం కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి శివాజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు..తిరిగి వస్తుండగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ ఘటనలో సందీప్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది.. వారిని వెంటనే పట్టుకుని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేసింది బీజేపీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..