Hyderabad: ట్రాన్స్ జెండర్ పోలీసులు వచ్చేస్తున్నారు.. ట్రాఫిక్ విభాగంలో సేవలు
తెలంగాణలోని ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించే దిశగా రేవంత్ సర్కార్ యాక్షన్‌లోకి దిగింది. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ట్రాన్స్ జెండర్ల నియామకాలు ప్రారంభించింది. ఈ నియామాకాల్లో భాగంగా తొలి రోజు మొత్తం 58 మంది అభ్యర్థులు ఈవెంట్స్‌కు హాజరవ్వగా.. 44 మంది సెలెక్ట్ అయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో ట్రాన్స్ జెండర్స్‌కు సమాజములో ఒక గుర్తింపు ఇవ్వడానికి హైదరాబాదు ట్రాఫిక్ పోలీసు విభాగములో ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా నియమించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు సిటీ కమిషనరేట్ పరిధిలో సెలెక్షన్స్ జరిగాయి. బుధవారం గోషామహల్ పోలీసు గ్రౌండులో సోషల్ వెల్ఫేర్ శాఖ ఇచ్చిన అభ్యర్థుల లిస్ట్ మేరకు ఈవెంట్స్ నిర్వహించారు. రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ లో మెరిట్ ఆధారంగా 44 మంది ట్రాన్స్ జెండర్స్‌ను ట్రాఫిక్ అసిస్టెంట్స్‌గా ఎంపిక చేశారు. వీరిలో 29 మంది ఉమెన్స్, 15 మంది మెన్ ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు ఉన్నారు.
18 సంవత్సరములు నిండి ఉండాలి. 40 ఏళ్లు పైబడిన వారు అర్హులు కాదు. అభ్యర్థి భారత పౌరుడిగా ఉండాలి. కనీసము SSC ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన వ్యక్తిగత గుర్తింపు కార్డు ఉండాలి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని స్థానిక అభ్యర్థులు అయి ఉండాలి. ట్రాన్స్ జెండర్ ఉమెన్ ఎత్తు 165 సెంమీ ఉండాలి. (ఎస్టీల విషయంలో 160 సెం.మీ)
సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కు ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో నియమించనున్నారు. వీరిని ఉద్దేశించి సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ… మీరు మీ కమ్యూనిటికి ఒక రోల్ మాడల్ కావాలి, హైదరాబాదు పోలీసు శాఖకు, తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని వారిని కోరి నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ట్రాన్స్ జెండర్లు గౌరవంగా బతికేలా చూస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యభిచారం, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా… సమాజంలో గౌరవంగా జీవించే విధంగా వారిని ఆదుకుంటామని రేవంత్ సర్కార్ మాట ఇచ్చింది. ఈ మేరకు పోలీస్ శాఖలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు కల్పిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..