వీళ్లు మామూలు దొంగలు కాదు.. నిలబడినట్టే నిలబడి 6లక్షలు దోచేశారు.. షాకింగ్ వీడియో

దొంగతనం ఎప్పుడైనా జరగొచ్చు.. ఎవరైనా చేసేయొచ్చు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా.. ఇదిగో ఇలా దోచేస్తారు దొంగలు.. తాజాగా.. ఆదిలాబాద్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.. బేల మండల కేంద్రంలో ఉన్న శ్రీకర్‌ మార్ట్‌లో పట్టపగలే భారీగా చోరీ చేశారు.

వీళ్లు మామూలు దొంగలు కాదు.. నిలబడినట్టే నిలబడి 6లక్షలు దోచేశారు.. షాకింగ్ వీడియో
Theft
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 05, 2024 | 12:38 PM

దొంగతనం ఎప్పుడైనా జరగొచ్చు.. ఎవరైనా చేసేయొచ్చు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత.. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా.. ఇదిగో ఇలా దోచేస్తారు దొంగలు.. తాజాగా.. ఆదిలాబాద్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు.. బేల మండల కేంద్రంలో ఉన్న శ్రీకర్‌ మార్ట్‌లో పట్టపగలే భారీగా చోరీ చేశారు.. రూ.5.87లక్షలు నగదు ఉన్న సంచిని అందరి ముందే.. గుట్టుగా చోరీ చేసి పరారయ్యారు.. అయితే, చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.. డబ్బు ఉన్న సంచిని చోరీ చేసిన ఇద్దరు యువకులు.. ఎవరూ చూడని సమయంలో చోరీచేసి చల్లగా జారుకున్నారు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

బేల శ్రీకర్‌ మార్ట్ లో కౌంటర్ మీద పెట్టిన 5లక్షల 87వేల రూపాయల నగదును గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గమనించిన శ్రీకర్ మార్ట్ యజమాని దుడంగులను చూసి వెంబడించగా అప్పటికే వారు పారిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన సీఐ సాయినాథ్ ఎస్సై దివ్యభారతి సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.

వీడియో చూడండి..

శ్రీకర్ మార్ట్ లో ఉన్న సీసీ ఫుటేజీని చూసి.. దొంగలను గుర్తించారు. దొంగలు మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు పోలీసులు.. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..