Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో నిప్పులు చెరుగుతోన్న భానుడు.. అక్కడ ఆరెంజ్ అలెర్ట్ జారీ..
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ వడ గాల్పులు తీవ్రమవుతున్నాయి. మార్చి నెల కూడా ముగియక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి.ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో మైండ్ బ్లాక్ అవుతుందా..? భగభగ మండే ఎండలకు ఏమైపోతామోనన్న
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ వడ గాల్పులు తీవ్రమవుతున్నాయి. మార్చి నెల కూడా ముగియక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో మైండ్ బ్లాక్ అవుతుందా..? భగభగ మండే ఎండలకు ఏమైపోతామోనన్న టెన్షన్ తెలుగు రాష్ట్రాల్లో క్రియేట్ అవుతోంది. ఎస్..తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అంతకంతకూ పెరుగుతోంది. మార్చి నెల చివరివారంలో పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది. ఈ సమ్మర్‌లో మాడు పగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కాస్త శాంతంగా కనిపించిన సూర్యుడు.. మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత బాగా పెరిగింది. ముఖ్యంగా తెలంగాణలో పదేళ్ల రికార్డు బద్దలైంది. ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
రానున్న రోజుల్లో మరింతగా..
మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ వైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అటు ఏపీ విషయానికి వస్తే.. అక్కడ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ చెప్తోంది. మిగతా జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంటాయని తెలిపింది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వడగాల్పుల ప్రభావం పెరిగే అవకాశం ఉందంటున్నారు. అటు విజయవాడలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలు దాటేశాయి. మధ్యాహ్నం సమయానికి రోడ్లపై జనం రద్దీ తగ్గుతోంది.
Also Read:Mamata Banerjee: ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై ఐక్యపోరాటం.. విపక్ష నేతలకు బెంగాల్ సీఎం మమత పిలుపు..
Food Knowledge: ఎక్స్పైరీ డేట్ లేని ఆహార పదార్థాలు ఎంటో తెలుసా.. తేనే నుంచి బియ్యం వరకు..
Russian Soldiers: నా కొడుకు ముందే రష్యా సైనికులు అత్యాచారం చేశారు.. ఉక్రెయిన్ మహిళ ఆరోపణ