Russian Soldiers: నా కొడుకు ముందే రష్యా సైనికులు అత్యాచారం చేశారు.. ఉక్రెయిన్ మహిళ ఆరోపణ

Russian Soldiers: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధం పెరిగిపోతోంది. ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా సైనికులు (Russia Soldiers) విరుచుకుపడుతున్నారు...

Russian Soldiers: నా కొడుకు ముందే రష్యా సైనికులు అత్యాచారం చేశారు.. ఉక్రెయిన్ మహిళ ఆరోపణ
Follow us
Subhash Goud

|

Updated on: Mar 29, 2022 | 12:53 PM

Russian Soldiers: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధం పెరిగిపోతోంది. ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా సైనికులు (Russia Soldiers) విరుచుకుపడుతున్నారు. రష్యా భీకర పోరు కొనసాగిస్తోంది. నియమ నిబంధనలేమి పట్టించుకోని రష్యా.. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే తమ దేశ మహిళలపై రష్యా  సైనికులు (Ukraine Soldiers)అత్యాచారాలకు, దాడులకు పాల్పడుతున్నారని ఉక్రెయిన్‌ మండిపడుతోంది. తన భర్తను కాల్చి చంపిన కొద్ది క్షణాలలో రష్యా సైనికులు తపై అత్యాచారం చేశారని, భయాందోళనకు గురైన నాలుగేళ్ల కొడుకు పక్క గదిలో ఏడుస్తున్నాడని ఉక్రెయిన్‌ మహిళ (Ukrainian Woman)పేర్కొంది. ఆమె ఆరోపణపై ఇప్పుడు విచారణ చేపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదిక పంచుకున్నారు. ఉక్రెయిన్‌లో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయని, బ్రోవరి ప్రాంతంలో ఉక్రెయిన్‌ మహిళపై కన్నబిడ్డ ఎదుటనే రష్యా సైనికులు అత్యాచారానికి పాల్పడినట్లు సదరు మహిళ ఆరోపించింది. తుపాకీతో భయపెట్టారని, నోరు మూసుకోకుంటే చంపేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించింది. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని ఉక్రెయిన్ ఎంపీ మరియా మెజెన్‌త్సెవా పిలుపు ఇస్తున్నారు.

బ్రోవరీ ప్రాంతంలో ఓ ఉక్రెయిన్ మహిళపై.. ఆమె కన్నబిడ్డ ఎదుటే రష్యా సైనికుడు అత్యాచారానికి పాల్పడ్డారట. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఎంపీ మరియా మెజెన్‌త్సెవా సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఉక్రెయిన్‌లో ఇలాంటివి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని ఆ ఎంపీ అంటున్నారు. కానీ వీటిలో చాలా వరకూ వెలుగులోకి రావడం లేదని సదరు ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాలని ఉక్రెయిన్ ఎంపీ మరియా మెజెన్‌త్సెవా పిలుపు ఇస్తున్నారు.

ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఘటన పూర్వాపరాలు సేకరిస్తోంది. రష్యా సైనికుల అరాచాకాలకు తగిన ఆధారాలు లభిస్తే.. ఇదో ఘోరమైన యుద్ధ నేరం అవుతుంది అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

Taliban Beard Rules: గడ్డం తీసేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారు.. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్..

Elon Musk: మళ్లీ కరోనా బారినపడిన టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌