Road Accident: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..
Jagityal Road Accident: తెలంగాణలోని జగిత్యాల (Jagityal) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మల్యాల మండలం రాజారం గ్రామ సమీపంలో
Jagityal Road Accident: తెలంగాణలోని జగిత్యాల (Jagityal) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మల్యాల మండలం రాజారం గ్రామ సమీపంలో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదం.. ఆదివారం సాయంత్రం జరిగింది. మల్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాలకు చెందిన సంజీవ్, మధు ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. దీంతో సంజీవ్‌తోపాటు ఆటోలో ఉన్న గోపాల్, మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన (Road Accident) పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలాఉంటే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది. కరీంనగర్ సిటీలోని ప్రఖ్యాత కమాన్ చౌరస్తా సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. రోడ్డుపక్కన గుడిసెలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మైనర్ కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో రాజేంద్రప్రసాద్ కుమారుడు, మరో ఇద్దరు స్నేహితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.
Also Read: