Mount Everest: ఎవరెస్టుపై మన దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన తెలంగాణ యువతి.. సర్వత్రా ప్రశంసల వర్షం..

ఎవరెస్ట్ శిఖరాన్ని తెలంగాణకు చెందిన పడమటి అనిత అధిరోహించింది. శిఖరంపై జాతీయ జెండాని సగర్వంగా ప్రదర్శించి. తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఎగరవేసింది.

Mount Everest: ఎవరెస్టుపై మన దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన తెలంగాణ యువతి.. సర్వత్రా ప్రశంసల వర్షం..
Telangana Girl Climbs Evere
Follow us
Surya Kala

|

Updated on: May 19, 2022 | 1:57 PM

Telangana Girl Climbs Everest: తెలంగాణ కీర్తి పతాకం ఎవరెస్ట్‌ శిఖరాగ్రానికి చేర్చింది యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన యువతి. ఇటీవల పర్వతారోహకురాలు 24 ఏళ్ల పడమటి అన్విత రెడ్డి (Anita) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. దీంతో అన్వితపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఎంపీ బూర నర్సింగ్ గౌడ్ పడమటి అన్వితఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు..  దేశ, విదేశాలోని ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అన్విత భువనగిరికి చెందిన యువతి అయినందుకు మనం గర్విద్దామని అన్నారు. కష్టాలను అధిగమించి శిఖరాన్ని అధిరోహించిన అన్వితకు, తన గురువులకు, తనను ఇంతగా ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు  ఎంపీ బూర నర్సింగ్ గౌడ్  అభినందనలు తెలియజేశారు.

పడమటి అన్విత రెడ్డి  29,112 అడుగుల (8,848.86 మీటర్లు) ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించింది. ఏప్రిల్‌ 10న భువనగిరి నుంచి బయల్దేరిన ఆమె 12న నేపాల్‌కు చేకుంది. నేపాల్ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్న ఆమె  అక్కడి శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొందింది. ఈ నెల 9వ తేదీన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించింది. ఈ నెల 16 సోమవారం ఉదయం 9:30 గంటలకు ఎవరెస్ట్‌ శిఖరానికి చేరుకొని తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. అక్కడ జాతీయ జెండాతో పాటు భువనగిరి ఖిల్లా, ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌, స్పాన్సర్స్‌ ఫ్లెక్సీలను సగర్వంగా ప్రదర్శించింది. తిరిగి ఈనెల 18 బుధవారం ఎవరెస్టు కింద ఉండే బేస్‌ క్యాంపుకు చేరుకున్నది.  దీంతో అన్విత నేపాల్‌ మార్గంలో శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. భువనగిరి ఖిల్లాపై పర్వతారోహణలో అనిత ప్రాథమిక శిక్షణ పొందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..