AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: తాటి కాయలతో చక్రాల బండి.. గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్న కోనసీమ చిన్నారులు

సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీలు పట్టే చిన్నారులు వేసవి సెలవుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇక స్కూళ్లకు సెలవులు ఇచ్చేశాక వాళ్ల ఆనందానికి హద్దులు ఉండవు. వేసవి సెలవులు అంటేనే ...

Konaseema: తాటి కాయలతో చక్రాల బండి.. గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్న కోనసీమ చిన్నారులు
Playing
Ganesh Mudavath
|

Updated on: May 18, 2022 | 9:48 PM

Share

సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీలు పట్టే చిన్నారులు వేసవి సెలవుల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇక స్కూళ్లకు సెలవులు ఇచ్చేశాక వాళ్ల ఆనందానికి హద్దులు ఉండవు. వేసవి సెలవులు అంటేనే ముందుగా పిల్లలందరికీ గుర్తుకు వచ్చేవి అమ్మమ్మ ఇల్లు. అక్కడ ఉండే స్నేహితులు, అందరితో కలిసి ఆడుకునే ఆటలు, ఆనందానికి హద్దులు లేని కేరింతలతో ఎంతో ఆనందంగా గడిపేస్తారు. ప్రస్తుతం ఆధునిక యుగంలో చిన్నారులు సెల్ ఫోన్లకు అలవాటు పడ్డారు. వీడియో గేమ్ లు ఆడుకుంటూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో త్వరగా అలసిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాతకాలం నాటి ఆటలు ఆరోగ్యంతో పాటు, ఆనందాన్నీ ఇస్తాయి. ఈ ఆటల్లో శారీరక శ్రమకు ఆస్కారం ఉండటంతో పిల్లలకు మంచి వ్యాయామం అవుతుంది. ఈ తరుణంలో కోనసీమ జిల్లాలో కొందరు చిన్నారులు పాతకాలం నాటి ఆటలు ఆడుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. తాటి ముంజులతో చేసిన బండ్లు, పిల్ల కాలువలో చిన్నారుల కేరింతలతో కోనసీమ కొత్త అందాన్ని సంతరించుకుంది.

సెలవులు వచ్చాయంటే పిల్లలను కాచుకునే తల్లులకు పెద్ద తలనొప్పిగా మారేది. వీధిలో ఉన్న పిల్లలు అందురు కలిసి ఎండను సైతం లెక్కచేయకుండా ఆటలు ఆడుకుంటారు. పాత తరం ఆటలు ప్రస్తుత పిల్లలకు తెలియడం లేదు. ఇప్పటికీ అలాంటి ఆటలు తెలియాలి అంటే మన పిల్లలను కోనసీమ తీసుకెళ్లాల్సిందే. వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఆడే ఆటలు అన్ని ఇన్ని కాదు. చింత పిక్కలు, తాటి మంజులతో చేసిన చక్రాల బండ్లతో ఆడే ఆటలతో పాటు, పిల్ల కాలువలో స్నానాలు, ఈత కొట్టడం ఇలా ఎన్నో ఆటలతో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

CM Jagan: మెగా పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌.. ప్రపంచంలోనే తొలిసారిగా..