Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గర్భవతి అయిన 13 ఏళ్ల బాలిక.. కారకుడెవరో తెలిసి ఆ పాప తల్లి గుండె చెరువయ్యింది..

వావివరసలు లేవు.. చిన్నా పెద్దా అన్న ఇంగితం లేదు... ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇంట్లో కూడా ఆడబిడ్డలకు సేఫ్టీ లేకుండా పోతుంది.

Hyderabad: గర్భవతి అయిన 13 ఏళ్ల బాలిక.. కారకుడెవరో తెలిసి ఆ పాప తల్లి గుండె చెరువయ్యింది..
representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: May 19, 2022 | 7:11 PM

కౌమార దశలో ఉన్న పిల్లల పట్ల అత్యంత అప్రమత్తత అవసరం. లేదంటే వారు ట్రాక్ తప్పే ప్రమాదం ఉంది.  పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారితో మంచి చెడ్డలు ముచ్చటించాలి. వారికి తప్పు, ఒప్పులు చెప్పాలి. టీనేజ్‌లో వచ్చే ఆలోచనల గురించి సున్నితంగా మాట్లాడాలి. ఒక ఫ్రెండ్‌గా వారు మాట్లాడగలిగేంత స్పేస్ ఇవ్వాలి. అలా బాండింగ్ ఉంటేనే వారు ప్రతి విషయాన్ని పేరెంట్స్‌తో పంచుకుంటారు. ఎందుకంటే మృగాళ్లు బయట మాత్రమే కాదు.. ఇంట్లో కూడా ఉండవచ్చు. ఇంట్లోనే వేధింపులకు గురికావొచ్చు. అవును.. తాజాగా  హైదరాబాద్​లోని బాచుపల్లి(Bachupally )లో దారుణం జరిగింది. ఓ మైనర్​ బాలికపై అత్యాచారం జరిగింది.  శాడ్ థింగ్ ఏంటంటే.. సొంత అన్నే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధి కౌసల్య కాలనీలో ఓ జంట నివాసం ఉంటున్నారు.  వీరికి  17 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. గత సంవత్సర కాలం నుంచి అన్న​.. తన చెల్లికి మాయమాటలు చెప్తూ.. ఇంట్లోనే లైంగిక దాడి చేస్తున్నాడు. సొంత అన్న కావడంతో.. తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారో అని బాలిక విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. బాధను పంటికిందే బిగబట్టింది.

అయితే  బాలికకు ఇటీవల.. పీరియడ్స్ రాకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. అనారోగ్య సమస్య ఏమో అని  ఆసుపత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేసిన డాక్టర్లు.. బాలిక 4 నెలల గర్భవతి అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దానికి కారడుకు తన కుమారుడే(బాలిక అన్నే) అని తెలిసి  ఆ తల్లి గుండె చెరువయ్యింది. వెంటనే తేరుకుని.. గర్భం తీసేయాలని డాక్టర్లను వేడుకుంది. దీంతో వైద్యులు చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ (మేడ్చల్ డీసీపీయూ) అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అధికారులు ఈ నెల 17న బాచుపల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(సున్నితమైన అంశం.. అందునా బాధితురాలు, నిందితుడు మైనర్స్ అవ్వడం వల్ల ఆ కుటుంబం తాలూకా వివరాలు వెల్లడించడం లేదు).