Polavaram: జేసీబీతో మట్టి తవ్వుతుండగా భూగర్భం నుంచి పెద్ద శబ్ధం.. బలంగా బయటకు లాగగా అద్భుతం

ఏలూరు జిల్లాలో అద్భుతం జరిగింది. పోలవరం పనుల సందర్భంగా అరుదైన దృశ్యం కనిపించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి

Polavaram: జేసీబీతో మట్టి తవ్వుతుండగా భూగర్భం నుంచి పెద్ద శబ్ధం.. బలంగా బయటకు లాగగా అద్భుతం
Polavaram Project
Follow us
Ram Naramaneni

|

Updated on: May 18, 2022 | 9:00 PM

Eluru district: ఏలూరు జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే ఎగువ భాగంలోని అప్రోచ్ చానల్లో గోదావరి నది(Godavari River) ఒడ్డున మట్టి తవ్వకాలు జరుపుతుండగా దశాబ్దాల నాటి శివలింగం బయటపడింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామమైన పాత పైడిపాక(Paidipaka) గోదావరి ఒడ్డున మెగా ఇంజినీరింగ్ సంస్థ మట్టి పనులను చేపడుతుంది.  ఈ క్రమంలో అప్రోచ్ ఛానల్ వద్ద జెసీబీలతో మట్టి తవ్వకాలు జరుపుతుండగా..  ఒక జేసీబీతో వర్క్ చేస్తున్న డ్రైవర్‌కు భూగర్భం లోపల ఏదో గట్టిగా తగలుతున్నట్లు అనిపించింది. దీంతో జేసీబీ కొమ్ముతో బలంగా బయటకు లాగగా పురాతమ శివలింగం బయటపడింది. ఒక్కసారిగా శివలింగం బయటపడడంతో లారీ డ్రైవర్లు, అక్కడ పనిచేస్తున్న వర్కర్లు ఉలిక్కి పడ్డారు. వెంటనే పనులను ఆపి శివలింగాన్ని బయటకు తీసి గట్టుపై పెట్టి గోదావరి జలాలతో భక్తి శ్రద్దలతో కడిగి శుభ్రపరిచారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. శివలింగాన్ని దర్శించుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరకుంటున్నారు. ప్రాజెక్ట్ దగ్గర్లో మంచి స్థలం చూసి.. శివలింగాన్ని ప్రతిష్ఠిస్తామని భక్తులు చెబుతున్నారు.