AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspirational: కిలీమంజారోను అధిరోహించిన హైదరాబాద్‌ బాలిక.. ఇంతటితో ఆగనంటోన్న డేరింగ్‌ గర్ల్‌..

కిలీమంజారో.. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన ఈ మంచు శిఖరాన్ని అధిరోహించాలంటే అంత సులభమేమీ కాదు. పర్వతారోహణలో ఎంతో నైపుణ్యం, అనుభవంతో పాటు ..

Inspirational: కిలీమంజారోను అధిరోహించిన హైదరాబాద్‌ బాలిక.. ఇంతటితో ఆగనంటోన్న డేరింగ్‌ గర్ల్‌..
Basha Shek
|

Updated on: Nov 16, 2021 | 12:04 PM

Share

కిలీమంజారో.. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన ఈ మంచు శిఖరాన్ని అధిరోహించాలంటే అంత సులభమేమీ కాదు. పర్వతారోహణలో ఎంతో నైపుణ్యం, అనుభవంతో పాటు అక్కడి వాతావరణ పరిస్థితులపై అవగాహన ఉండి తీరాల్సిందే. లేకపోతే హఠాత్తుగా వచ్చే మంచు తుపాన్లతో సమస్యలు తప్పవు. ఈ నేపథ్యంలో 5, 895 మీటర్ల ఎత్తుండే ఈ ప్రమాదకరమైన ఈ శిఖరాన్ని హైదరాబాద్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక పులకిత హస్వి విజయవంతంగా అధిరోహించింది. కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఇష్టంగా ఎదుర్కోవచ్చు అన్న మాటలను నిజం చేసింది. కాగా తన పర్వతారోహణకు సంబంధించిన శిక్షణ, ఎదురైన అనుభవాల గురించి పులకిత ఇలా పంచుకుంది.

ఏప్రిల్‌ నుంచి సన్నద్ధం.. ‘సినిమాలు చూడడం ద్వారా పర్వతారోహణకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాను. ఇక కిలీమంజారో పర్వత అధిరోహణ కోసం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సన్నద్ధమవుతున్నాను. ముందుగా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపులో మూడు నెలలు శిక్షణ పొందాను. అక్కడ మౌంటెయినీరింగ్‌కు సంబంధించి శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢత్వం సాధించాను. ఇందుకోసం యోగా, మెడిటేషన్‌లను నా జీవితంలో భాగం చేసుకున్నాను. ఇక్కడితో నా ప్రయాణం ఆగిపోదు. 2024కు ముందే ప్రపంచంలోని ఏడు శిఖరాలు (సెవెన్‌ సమ్మిట్స్‌)ను పూర్తి చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నాను’ అని అంటోందీ డేరింగ్‌ గర్ల్‌.

Also Read:

Telangana MLC Elections 2021: ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఖరారు చేసిన టీఆర్ఎస్!

Hyd Dancer Death: అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. కారణం ఇదేనా..? ఆర్కేస్ట్రా ట్రూపులో డ్యాన్సర్‌గా ఫాతిమా.. (వీడియో)

News Watch: ఉద్రిక్తంగా బండి పర్యటన.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..