AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana MLC Elections 2021: ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఖరారు చేసిన టీఆర్ఎస్!

TRS MLC Candidates: తీవ్ర ఉత్కంఠకు తెర దించుతూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆఖరి నిమిషంలో ట్విస్టులు కనిపిస్తున్నాయి.

Telangana MLC Elections 2021: ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఖరారు చేసిన టీఆర్ఎస్!
Kcr
Balaraju Goud
|

Updated on: Nov 16, 2021 | 11:22 AM

Share

TRS MLC Candidates: తీవ్ర ఉత్కంఠకు తెర దించుతూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆఖరి నిమిషంలో ట్విస్టులు కనిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌ ప్రగతి భవన్‌ చేరుకున్నారు. ఆయనను మండలికి పంపించి.. కేబినెట్‌లోకి తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. ఇప్పటి వరకూ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అనుకున్న ఓ ఎమ్మెల్సీ సీటు.. ఆయన చేజారినట్లుగా ఉంది. అది కాస్త.. సిద్ధిపేట కలెక్టర్‌గా ఉండి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డికే ఇచ్చే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా చూస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రకటించిన జాబితాను చూస్తే గుత్తా సుఖేందర్‌, పాడి కౌశిక్‌ రెడ్డి, తక్కెళ్లపళ్లి రవీందర్‌ రావు, కడియం శ్రీహరి కన్‌ఫాం అయ్యారు. మరో రెండు స్థానాల్లో ఒకటి ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అనుకున్నా అది వెంకట్రామిరెడ్డికి ఇవ్వొచ్చంటున్నారు. మరో అభ్యర్థిగా బండా ప్రకాష్‌ పేరు తెరపైకి వచ్చింది. జాబితా ప్రకటించే ముందు వరకూ ప్రాబబుల్స్ లో ఉన్న టీఆర్ఎస్ దళిత నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు చివరికి నిరాశ ఎదురైంది. సోమవారం నాడే సిద్దిపేట్ కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డికి జాక్ పాట్ మాదిరిగా మంగళవారం నాడు ఎమ్మెల్సీ పదవి దక్కింది.

టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనలైజ్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా కొద్ది సేపటి కిందటే విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యా బలాన్ని బట్టి ఈ ఆరుగురూ ఎమ్మెల్సీలు దాదాపు ఏకగ్రీవంగానే ఎన్నిక కానున్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇవాళే ఆఖరు. ఇప్పటికే ప్రగతి భవన్‌ చేరుకున్న టీఆర్ఎస్ అభ్యర్థులు.. అక్కడి నుంచి నేరుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు.

ఇదిలావుంటే, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 29న జరుగుతాయి. అదే రోజు కౌంటింగ్‌ ఉంటుంది. మరోవైపు.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబర్‌ 10న పోలింగ్‌, 14న కౌంటింగ్‌ జరుగుతుంది. మరి, కాంగ్రెస్ వ్యూహం ఏమిటన్నది తేలాల్సి ఉంది.

Read Also…. Karivena Satram: కాశీ తెలుగు యాత్రికులకు గుడ్‌న్యూస్.. వారణాసిలో అందుబాటులోకి వచ్చిన అధునాతన భవనం!

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నరకుపైగా జీతం పొందే అవకాశం..