Zomato UPI Services: జొమాటో సొంత యూపీఐ సర్వీసులు షురూ.. యాక్టివేట్ చేసుకోండిలా..!
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వ్యాపార రంగంలో తనదైన మార్క్ చూపుతుంది. అయితే యాప్ ద్వారా ఆర్డర్ చేసే సమయంలో క్యాష్ ఆన్ డెలివరీ కంటే ఇతర పేమెంట్ యాప్స్ ద్వారా సొమ్ము చెల్లించే సమయంలో థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా సొమ్ము చెల్లించాల్సి వస్తుంది. దీంతో వినియోగదారులు కొంత మేరక అసౌకర్యానిక గురవుతున్నారు. ఈ అసౌకర్యాన్ని అధిగమించేందుకు జొమాటో తన సొంత యూపీఐ సేవలను ప్రారంభించింది.
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో దాన్ని ఆసరాగా చేసుకుని వివిధ సర్వీసులు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత యాప్స్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ మార్కెట్‌లో పెద్ద మార్పును తీసుకువచ్చాయి. అయితే స్పీడ్ డెలివరీ సిస్టమ్‌తో వచ్చిన ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వ్యాపార రంగంలో తనదైన మార్క్ చూపుతుంది. అయితే యాప్ ద్వారా ఆర్డర్ చేసే సమయంలో క్యాష్ ఆన్ డెలివరీ కంటే ఇతర పేమెంట్ యాప్స్ ద్వారా సొమ్ము చెల్లించే సమయంలో థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా సొమ్ము చెల్లించాల్సి వస్తుంది. దీంతో వినియోగదారులు కొంత మేరక అసౌకర్యానిక గురవుతున్నారు. ఈ అసౌకర్యాన్ని అధిగమించేందుకు జొమాటో తన సొంత యూపీఐ సేవలను ప్రారంభించింది. ఈ సర్వీస్ ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో రియల్ టైమ్ చెల్లింపు వ్యవస్థగా పని చేయనుంది. జోమాటో ప్రవేశపెట్టిన ఈ కొత్త సేవ వినియోగదారులు వ్యాపారులు, వ్యక్తులకు నేరుగా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. అలాగే ఇతర వినియోగదారులకు పీర్-టు-పీర్ పద్ధతిలో డబ్బును కూడా పంపవచ్చు. ముఖ్యంగా జోమాటోను ఉపయోగించే కస్టమర్లు ఇప్పుడు అప్లికేషన్‌కి సైన్ ఇన్ చేసి వారి సొంత యూపీఐ ఐడీలను సృష్టించుకోవచ్చు. తర్వాత వారు యాప్ ద్వారానే చెల్లింపులు చేసే అవకాశం పొందుతారు.
ముఖ్యంగా జొమాటో క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) ఆర్డర్ల సంఖ్యను తగ్గించడానికి ఈ మార్పును అమలు చేసింది. అదనంగా ఈ చర్య ద్వారా పేటీఎం, గూగుల్ పే వ్యాపారాలపై ప్రభావం చూపవచ్చు. ఎందుకంటే జొమాటో యూపీఐ ఖాతాను సృష్టించడానికి కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జొమాటో యూపీఐ సర్వీస్ పైలట్ ప్రోగ్రామ్‌లో ఉంది. కేవలం పరిమిత సంఖ్యలో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, రాబోయే నెలల్లో ఈ సేవ జొమాటో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రారంభంలో ఐసీఐసీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్న జొమాటో సమీప భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులతో సహకరించాలని కూడా యోచిస్తోంది. ఇప్పుడు మన మొబైల్లోని జొమాటో యాప్‌లో యూపీఐ సేవను ఎలా ప్రారంభించాలో? తెలుసుకుందాం.
జొమాటో యూపీఐ సేవలను ప్రారంభించండిలా
- మీ ఫోన్‌లో జొమాటో యాప్‌ని తెరవాలి.
- మీ జొమాటో ఖాతాలోని ప్రొఫైల్ విభాగంపై క్లిక్ చేయాలి.
- మీరు జొమాటో యూపీఐ ఎంపికను కనుగొనే వరకు కిందికి స్క్రోల్ చేయాలి.
- జోమాటో యూపీఐను యాక్టివేట్ చేయిపై క్లిక్ చేయాలి.
- అనంతరం మీకు కావాల్సిన జొమాటో యూపీఐ ఐడీ సెట్ చేయాలి.
- ప్రాంప్ట్ చేసిన సమయంలో మీ మొబైల్ నంబర్‌ని ఎంచుకోవాలి.
- జొమాటో అప్లికేషన్ ద్వారా అప్రయత్నంగా చెల్లింపులను ప్రారంభించడానికి మీ బ్యాంక్ ఖాతాను లింక్ చేస్తే మీ జొమాటో ఖాతాలో యూపీఐ సర్వీసులు ప్రారంభం అవుతాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..