Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Smart Watch: ఇద్దరి ప్రాణాలను కాపాడిన యాపిల్ స్మార్ట్ వాచ్ ఫీచర్.. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటో తెలుసా?

ఆరోగ్య సంబంధిత ఫీచర్ల వల్ల వయస్సుతో సంబంధం లేకుండా అంతా స్మార్ట్ వాచ్‌లను వినియోగిస్తున్నారు. అయితే ఫీచర్ల పరంగా ఎప్పుడూ ముందు వరుసలో ఉండే యాపిల్. స్మార్ట్ వాచ్‌ల విషయంలో తనదైన పంథా నిరూపించుకుంటుంది. తాజా యాపిల్ వాచ్‌లో ఉన్న ఫీచర్ ఇద్దరు మహిళల ప్రాణాలు కాపాడిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Apple Smart Watch: ఇద్దరి ప్రాణాలను కాపాడిన యాపిల్ స్మార్ట్ వాచ్ ఫీచర్.. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటో తెలుసా?
Apple Watch 7
Follow us
Srinu

|

Updated on: May 17, 2023 | 6:30 PM

యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లతో స్మార్ట్ యాక్ససరీస్‌పై కూడా మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ యాక్ససరీస్‌లో స్మార్ట్ వాచ్‌లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల రాకతో యువత వాచ్‌లకు దూరమయ్యారు. ఇప్పుడు ఆ ట్రెండ్ స్మార్ట్ వాచ్‌లతో మళ్లీ ప్రారంభమైంది. ముఖ్యంగా సమయం చూసుకోవడానికి మాత్రమే కాకుండా ఈ స్మార్ట్ వాచ్ వివిధ ఫీచర్లు ఉంటున్నాయి. ఆరోగ్య సంబంధిత ఫీచర్ల వల్ల వయస్సుతో సంబంధం లేకుండా అంతా స్మార్ట్ వాచ్‌లను వినియోగిస్తున్నారు. అయితే ఫీచర్ల పరంగా ఎప్పుడూ ముందు వరుసలో ఉండే యాపిల్. స్మార్ట్ వాచ్‌ల విషయంలో తనదైన పంథా నిరూపించుకుంటుంది. తాజా యాపిల్ వాచ్‌లో ఉన్న ఫీచర్ ఇద్దరు మహిళల ప్రాణాలు కాపాడిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యాపిల్ వాచ్‌లో ఉండే ఫాల్ డిటెక్షన్ అని పిలిచే లైఫ్-సేవింగ్ ఫీచర్ వినియోగదారులకు చాలా బాగా సహాయపడుతుంది. అలాగే చాలా మంది జీవితాలను కాపాడుతుంది. యుఎస్ రాష్ట్రాలలోని మిన్నెసోటా, ఒహియో నుండి రెండు వేర్వేరు సంఘటనల్లో మహిళలు ఈ ఫీచర్ వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆపిల్ వాచ్ దాని శీఘ్ర గుర్తింపు, హెచ్చరిక సేవల కారణంగా ప్రజల ప్రాణాల రక్షణలో ఎలా ఉపయోగపడిందో? తాజా ఘటనల వల్ల నిరూపితమైంది. 

మ్యాక్ రూమర్స్ నివేదిక ప్రకారం మైకెల్ బ్రోడ్‌కోర్బ్ అనే యాపిల్ వాచ్ వినియోగదారుడు ఇటీవల తీవ్ర ప్రమాదానికి గురయ్యాడు. మిన్నెసోటాలో జరిగిన ఈ ఘటనలో బాధితుడు కనీసం ఎమెర్జెన్సీకు ఫోన్ చేసే స్థితిలో కూడా లేడు. అయితే ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ద్వారా యాపిల్ ఫోన్ స్వయంచాలకంగా 911 ఎమెర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసింది. దీంతో వారు వచ్చి అతని ప్రాణాలు కాపాడారు. మరో సంఘటనలో ఓహియోలోని సిన్సినాటికి చెందిన విలియం ఫ్రైయర్ అనే 83 ఏళ్ల వ్యక్తి నడకకు వెళ్లి అక్కడ ఓహియో నది ట్రయిల్‌లో కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే, అతని గడియారం పడిపోయినట్లు గుర్తించి, వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేసి అతని కుమార్తెను కూడా అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఈ రెండు సంఘటనలు ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో? అర్థం చేసుకోవచ్చు. 

ఫాల్ డిటెక్షన్ ఫీచర్

యాపిల్ వాచ్ సిరీస్ 4 ప్రారంభంలో ఫాల్ డిటెక్షన్ ఫీచర్ మొదటిసారిగా 2018లో పరిచయం చేసింది. ఈ ఫీచర్ వాచ్ యాక్సిలరోమీటర్, గైరోస్కోప్‌ని ఉపయోగించి, ధరించిన వారితో ఎలాంటి ప్రమాదం జరిగినా లేదా హార్డ్ ఫాల్‌ను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. గడియారం పడిపోయినట్లు లేదా ప్రమాదాన్ని గుర్తిస్తే వారు బాగానే ఉన్నారో లేదో నిర్ధారించడానికి అది వెంటనే ధరించిన వారికి హెచ్చరికను పంపుతుంది. ఎలాంటి ప్రతిస్పందన రానప్పుడు, పరికరం స్వయంచాలకంగా అత్యవసర సేవలను సంప్రదిస్తుంది. ముఖ్యంగా ఈ వాచ్ ధరించిన వారి లోకేషన్‌ను కూడా షేర్ చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..