Apple Watch Camera: యాపిల్ వాచ్‌లో కెమెరా.. పేటెంట్ కూడా వచ్చేసిందిగా..!
యాపిల్ ప్రొడెక్ట్స్ వాడడం అంటే ఓ లెవెల్లా కొంత మంది ఫీలవుతుంటారు. యాపిల్ ఫోన్స్ తర్వాత ఎక్కువ యాపిల్ స్మార్ట్ వాచ్‌లు ఎక్కువ మంది మనస్సును గెలుచుకున్నాయి. ప్రస్తుతం యాపిల్ వాచ్‌ల్లో కెమెరా ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ప్రస్తుత రోజుల్లో యాపిల్ గ్యాడ్జెట్స్ యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వారి అంచనాలకు తగ్గట్టుగానే యాపిల్ కూడా తన గ్యాడ్జెట్స్‌లో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ రోజుల్లో యాపిల్ ప్రొడెక్ట్స్ వాడడం అంటే ఓ లెవెల్లా కొంత మంది ఫీలవుతుంటారు. యాపిల్ ఫోన్స్ తర్వాత ఎక్కువ యాపిల్ స్మార్ట్ వాచ్‌లు ఎక్కువ మంది మనస్సును గెలుచుకున్నాయి. ప్రస్తుతం యాపిల్ వాచ్‌ల్లో కెమెరా ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు యాపిల్ స్మార్ట్ వాచ్ కెమెరాకు పెటెంట్ రైట్స్ కూడా వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. యాపిల్ డిటాచబుల్ వాచ్ బేస్‌డ్ కెమెరా రిటెన్షన్ సిస్టమ్‌కు పెటెంట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్తలను బట్టి భవిష్యత్‌లో యాపిల్ స్మార్ట్‌వాచ్‌లకు కెమెరాలు వచ్చే అవకాశం ఉంది.
డిటాచబుల్ బ్యాండ్ సిస్టమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ కెమెరా యూనిట్‌ను సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుగా యంత్రాగాన్ని యాపిల్ సంస్థ అభివృద్ది చేసినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వినియోగదారులు బ్యాండ్ త్వరగా తీసేసి వాచ్ దిగువున ఉన్న కెమెరాల నుంచి ఫొటోలు తీసి వాటిని స్నాప్ చేసేలా టెక్నాలజీని యాపిల్ అభివృద్ధి చేసింది. యాపిల్ నెస్ట్ మెకానిజం ద్వారా వాచ్‌ను స్పీడ్‌గా చేతినుంచి తీసివేసి వినియోగదారుడు కెమెరా యాక్సెస్ చేసుకునేలా రూపొందించే అవకాశం ఉంది. అయితే మార్కెట్‌లో యాపిల్ ఒక్కటే మొదటి సారిగా స్మార్ట్ వాచ్ కెమెరాను రిలీజ్ చేయలేదు. గతంలో సామ్‌సంగ్ గెలాక్సీ గెర్ స్మార్ట్ వాచ్‌లో కూడా 1.91 ఎంపీ కెమెరాతో వచ్చింది. అయితే ఆ స్మార్ట్ అంతలా వినియోగదారులను ఆకట్టుకోలేదు. అయితే స్మార్ట్ వాచ్‌లో కెమెరాలు ఆహ్వానించదగిన పరిణామమే అయినా గోప్యతా సమస్యలు కూడా పెంచే అవకాశం ఉంది. స్మార్ట్ గ్లాసెస్‌లోని కెమెరా ఇండికేటర్ వంటి ఫీచర్లను ఇవ్వడం ద్వారా భద్రతా ఫీచర్లను మెరుగుపర్చాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..