Samsung S 23: సామ్‌సంగ్‌ ఎస్ 23లో సరికొత్త ఎడిషన్.. కొన్ని యూనిట్లకే పరిమతం

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ అందుబాటులోకి తీసురానున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ బీఎండబ్ల్యూ ఎడిషన్ పరిమిత సంఖ్యలో అంటే కేవలం 1000 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

Samsung S 23: సామ్‌సంగ్‌ ఎస్ 23లో సరికొత్త ఎడిషన్.. కొన్ని యూనిట్లకే పరిమతం
Samsung Galaxy S23
Follow us
Srinu

|

Updated on: Feb 14, 2023 | 2:38 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ ఇటీవల మార్కెట్‌లో తన కొత్త మోడల్ ఎస్ 23ను లాంచ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసిన ఈ ఫోన్ తొలి 24 గంటల్లోనే రూ.1400 కోట్లు విలువైన యూనిట్ల కోసం వినియోగదారులు ప్రీ బుక్ చేసుకున్నారు. దీన్ని బట్టే వినియోగదారులను ఈ ఫోన్ ఏ స్థాయిలో ఆకట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్‌లో సరికొత్త ఎడిషన్ లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ఇటీవల తెలిపారు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ అందుబాటులోకి తీసురానున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ బీఎండబ్ల్యూ ఎడిషన్ పరిమిత సంఖ్యలో అంటే కేవలం 1000 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఎడిషన్ బీఎండబ్ల్యూ ఎం3 ఈ30 నుంచి ప్రేరణ పొందింది. ఎస్‌కే టెలికాం సహాయంతో ఈ యూనిట్లను విక్రయించనున్నారు. 12 జీబీ+ 512 జీబీ వెర్షన్‌లో వచ్చే ఈ ఫోన్ రూ.1,72,999కు వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. 

బీఎండబ్ల్యూ ఎడిషన్ ప్యాకింగ్ ప్రత్యేకం

వినియోగదారులు కొన్ని మరపురాని ఉపకరణాలు ఈ బీఎండబ్ల్యూ ఎడిషన్ ప్యాకింగ్‌లో పొందుతారు. బీఎండబ్ల్యూ నేపథ్య కేస్, బీఎండబ్ల్యూ చిహ్నాలతో ఉండే రింగ్, కంపెనీ 50వ వార్సికోత్సవం సందర్భంగా ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ రౌండల్, బీఎండబ్ల్యూ బ్యాటరీతో నడిచే ఎయిర్ కంప్రసర్, కప్ హోల్డర్, ఓ గడియారం, ఓ పుస్తకం, ఓ ఫొటోను పొందుతారు. అంతేకాకుండా వినియోగదారులు దక్షిణ కొరియాలోని బీఎండబ్ల్యూ డ్రైవింగ్ సెంటర్ గురించి స్టార్టర్ ప్యాక్ వోచర్‌ను పొందుతారు. ఈ ప్రత్యేక ఎడిషన్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా కస్టమ్ బూట్ యానిమేషన్, కొత్త థీం రూపంలో ఇంటీరియర్‌లోని కొన్ని మార్పులను పొందుతారు. అలాగే ఇది ఫాంటమ్ బ్లాంక్‌లో అందిస్తారు. అయితే బీఎండబ్ల్యూ ఎస్ 23 స్పెసిఫికేషన్లు, సాధారణ ఎస్ 23 స్పెసిపికేషన్లు ఒకేలా ఉన్నాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా స్పెసిఫికేషన్లు ఇవే

  • 6.8 అంగుళాల ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లే
  • 200 ఎంపీ ఐసో సెల్ హెచ్‌పీ 2 సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..