Apple Watch features: యాపిల్ స్మార్ట్ వాచ్‌లో మరో సరికొత్త ఫీచర్.. రక్తం లేకుండానే షుగర్ పరీక్ష..

యాపిల్ కంపెనీ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో యాపిల్ వాచ్‌ల్లో ఈసీజీ ఫీచర్‌ను జోడించిన కంపెనీ తాజాగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే విధంగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తెలుసుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Apple Watch features: యాపిల్ స్మార్ట్ వాచ్‌లో మరో సరికొత్త ఫీచర్.. రక్తం లేకుండానే షుగర్ పరీక్ష..
Apple
Follow us
Srinu

|

Updated on: Feb 25, 2023 | 4:10 PM

మార్కెట్‌లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని మరింత పెంచేందుకు ఆయా కంపెనీ కొత్త వాటిల్లో కొత్త ఫీచర్లను జోడించడానికి వివిధ పరిశోధనలు చేస్తున్నాయి. ఈ పరిశోధనల్లో ముందు వరుసలో ఉండే యాపిల్ కంపెనీ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో యాపిల్ వాచ్‌ల్లో ఈసీజీ ఫీచర్‌ను జోడించిన కంపెనీ తాజాగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడే విధంగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తెలుసుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ పుకార్లు చాలా కాలం నుంచి వినిపిస్తున్నా తాజా వాటికి బలం చేకూర్చేలా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి.

బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సపోర్ట్‌తో, త్వరలో ఆపిల్ వాచ్ డయాబెటిక్, నాన్-డయాబెటిక్ పేషెంట్లకు రక్తం తీసుకునే అవసరం లేకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించడంలో సహాయపడుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. రక్తం లేకుండా గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించడానికి, ఆపిల్ ఆప్టికల్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించే సిలికాన్ ఫోటోనిక్స్ చిప్‌ను అభివృద్ధి చేస్తుందని, అలాగే శరీరంలోని గ్లూకోజ్ సాంద్రతను గుర్తించడానికి చర్మం కింద లేజర్ నుంచి కాంతిని ప్రకాశింపజేసి గ్లూకోజ్ లెవెల్స్ తెలుసుకునే ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఆపిల్ నో-ప్రిక్ గ్లూకోజ్ మానిటరింగ్ ఇప్పుడు ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ స్టేజ్‌లో ఉంది. దీన్ని అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ధరించడానికి సరిపోయాలే దీన్ని డిజైన్‌పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం, ప్రోటోటైప్ పరికరం ఐఫోన్‌కు సమానమైన పరిమాణంలో ఉందని, త్వరలోనే మనిషి చేతికి ధరించేలా స్మార్ట్ వాచ్‌లో ఈ ఫీచర్‌ను యాపిల్ అందుబాటులోకి తీసుకువస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

యాపిల్ కంపెనీ ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. అయితే యాపిల్ కంపెనీ చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తుందని మాత్రం తెలుస్తోంది. 2010లో యాపిల్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ స్టార్టప్ రేర్‌లైట్‌ని కొనుగోలు చేయడంతో ఇదంతా ప్రారంభమైంది. అప్పటి నుంచి కంపెనీ చాలా రహస్యంగా ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. ప్రస్తుతం వస్తున్న ఈ వార్తలు ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతుంది. అయితే రక్తం అవసరం లేకుండా రక్త పరీక్ష చేయడం అంటే దాన్ని వాస్తవికతపై చాలా పరిశోధనలు జరగాలి కాబట్టి యాపిల్ ఈ వాచ్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇతర టెక్ కంపెనీలు గతంలో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ టెక్‌పై పనిచేశాయి, అయితే ఇంకా నిజమైన ఉత్పత్తులు మాత్రం తీసుకురాలేకపోయాయి. అయితే ప్రస్తుతం యాపిల్ కంపెనీ ఇలాంటి వాచ్‌ను తీసుకువస్తుందో లేదో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..