Laptops Under Rs.50000: యాబై వేల లోపు అదిరిపోయే ల్యాప్‌టాప్‌లు ఇవే.. ఫీచర్లు చూస్తే మతిపోతుందంతే..!
ప్రస్తుతం పెరుగుతున్న ధరల నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌ల కోసం యువత ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో తక్కువ ధరకే అధిక ఫీచర్లు ఇచ్చే ల్యాప్‌టాప్‌ల గురించి తెలుసుకుందాం. కేవలం రూ.50000 లోపు ఉన్న ల్యాప్‌టాప్స్‌లో ఇచ్చే ఫీచర్లు అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి.
కరోనా లాక్‌డౌన్ తర్వాత భారత్‌లో వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ బాగా పెరిగింది. కాబట్టి ల్యాప్‌టాప్‌ల వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. అలాగే ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థులు ల్యాప్‌టాప్‌లపై ఆధారపడుతున్నారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరల నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌ల కోసం యువత ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో తక్కువ ధరకే అధిక ఫీచర్లు ఇచ్చే ల్యాప్‌టాప్‌ల గురించి తెలుసుకుందాం. కేవలం రూ.50000 లోపు ఉన్న ల్యాప్‌టాప్స్‌లో ఇచ్చే ఫీచర్లు అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. రూ. 50,000లోపు ఐదు ల్యాప్‌టాప్‌లు మే 2023లో కొనుగోలు చేయడానికి పరిగణించదగినవిగా ఉన్నాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
హెచ్‌పీ 15 ఎస్
కాలేజ్ అవసరాల కోసం హెచ్‌పీ 15 ఎస్ ల్యాప్‌టాప్ అందరినీ ఆకట్టుకుంటుంది. రైజన్ 5500 యూ ప్రాసెసర్‌తో వస్తుంది.1.6 కిలోల ఉండే ఈ ల్యాప్‌టాప్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. అలాగే ఈ ల్యాప్‌టాప్ 15 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 8 జీబీ+ 512 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ల్యాప్‌టాప్ అలెక్సా సపోర్ట్‌తో పాటు ఎస్‌డీ కార్డు స్లాట్‌గో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధరరూ.47999గా ఉంది0
లెనెవో ఐడియల్ ప్యాడ్ స్లిమ్3
ఈ ల్యాప్‌టాప్ విద్యార్థులు, నిపుణుల కోసం ఒక గొప్ప ఎంపిక. ఇది 8 జీబీ+512 జీబీ వేరియంట్‌లో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ కూడా రైజన్ 5- 5500 యూ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే, రేడియన్ గ్రాఫిక్స్‌ను కూడా కలిగి ఉంది. ముఖ్యంగా ఈ ల్యాప్‌టాప్ అలెక్సా వాయిస్ కమాండ్లతో వస్తుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్ ధర రూ.48,990గా ఉంది.
ఆసస్ వివో బుక్ ఫ్లిప్ 14
వివో బుక్ ఫ్లిప్ 14 మీకు బహుముఖ ల్యాప్‌టాప్-టు-టాబ్లెట్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్ విశ్రాంతి సమయంలో వారి పీసీ లో నేరుగా సినిమాలు చూడటం లేదా చదవడం ఆనందించే వ్యక్తులకు బాగా సరిపోయేలా చేస్తుంది.11వ తరం కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ + 512 జీబీ ఎస్ఎస్‌డీ వేరియంట్‌లో ఈ ల్యాప్టాప్ అందుబాటులో ఉంటుంది. 14 అంగుళాల పూర్తి హెచ్‌డీ టచ్ డిస్‌ప్లే స్టైలస్ వినియోగానికి మద్దతు ఇస్తుంది. కేవలం 1.5 కిలోల బరువు ఉండే ఈ ల్యాప్‌టాప్ ధర రూ.44,990గా ఉంటుంది.
ఆసస్ వివో బుక్ 16 ఎక్స్
వివో బుక్ 16 ఎక్స్ నిపుణుల కోసం శక్తివంతమైన, బహుముఖ ల్యాప్‌టాప్. ఇది 16 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే, ఏఎండీ రైజెన్ 5 5600 హెచ్ ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే 8 జీబీ+ 128 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11ను సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్‌తో నోట్‌బుక్‌లను ఇష్టపడితే ఈ ల్యాప్‌టాప్ మంచి ఎంపిక. సినిమాలు చూడటం లేదా స్ప్రెడ్‌షీట్‌లలో పని చేయడం ఆనందించే వారికి పెద్ద స్క్రీన్‌లు ప్రత్యేకంగా సహాయపడతాయి. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.49,990గా ఉంది.
ఎంఐ నోట్ బుక్ ప్రో
మీరు డిజైన్‌కు ప్రాధాన్యత ఇస్తే ఎంఐ నోట్‌బుక్ ప్రోని పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం. ఇది ప్రస్తుతం రూ. 51,000కి అందుబాటులో ఉంది. అయితే సులభమైన బ్యాంక్ ఆఫర్‌లతో ధర దాదాపు రూ.48,000కు దిగిపోతుతుంది. ఈ ల్యాప్‌టాప్ సొగసైన మెటల్ బాడీని, 2.5కే క్యూహెచ్‌డీ ప్లస్ 14-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ పరికరాన్ని శక్తివంతం చేయడం 11వ తరం కోర్ ఐ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. మెటల్ బాడీతో వచ్చి దీని బరువు కేవలం రూ.1.4 కేజీలు మాత్రమే ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ ఎంఐ వెబ్‌సైట్‌లో ఈ ల్యాప్‌టాప్ రూ.50,999కు అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..