గూగుల్ పిక్సల్ 7ఏ అదిరింది.. అదే ధరలో అంతకుమించిన ఫీచర్లున్న ఫోన్లు ఇవి.. ఓ లుక్కేయండి..

Best Alternatives to Google Pixel 7a: గూగుల్ పిక్సల్ 7ఏను తొలుత దీనిని రూ. 43,999కి లాంచ్ చేశారు. ఫ్లిప్ కార్ట్ లో పలు బ్యాంకు ఆఫర్లతో ఇది 39,999కి లభిస్తోంది. అయితే ఇదే ధరకు మరిన్ని ఫోన్లు గూగుల్ పిక్సల్ 7ఏకు పోటీ నిస్తున్నాయి. గూగుల్ పిక్సల్ 7ఏకి మించిన రేంజ్లో ఫీచర్లున్నాయి.

గూగుల్ పిక్సల్ 7ఏ అదిరింది.. అదే ధరలో అంతకుమించిన ఫీచర్లున్న ఫోన్లు ఇవి.. ఓ లుక్కేయండి..
Google Pixel 7a
Follow us
Madhu

|

Updated on: May 17, 2023 | 4:00 PM

గూగుల్ ఐ/ఓ 2023లో అనేక కొత్త ఉత్పత్తులను గూగుల్ ఆవిష్కరించింది. దానిలో గూగుల్ పిక్సల్ 7ఏ ఒకటి. దీని ధర రూ. 45,000దాకా ఉంటుంది. దీనిలో ఉన్న ఫీచర్లు, ఈ ఫోన్ డిజైన్ వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తోంది. ప్రధానంగా వైర్ లెస్ చార్జింగ్ సాంకేతికత దీనిలో కొత్త తీసుకొచ్చారు. అలాగే అధిక రిఫ్రెష్ రేట్, అధిక కెమెరా క్వాలిటీ ఉంటుంది. తొలుత దీనిని రూ. 43,999కి లాంచ్ చేశారు. ఫ్లిప్ కార్ట్ లో పలు బ్యాంకు ఆఫర్లతో ఇది 39,999కి లభిస్తోంది. అయితే ఇదే ధరకు మరిన్ని ఫోన్లు గూగుల్ పిక్సల్ 7ఏకు పోటీ నిస్తున్నాయి. ఈ ఫోన్ కిదగ్గరగానే ఫీచర్లు ఉన్నాయి. ఆ ఫోన్ల గురించి తెలుసుకునే ముందు.. అసలు గూగుల్ పిక్సల్ 7ఏలో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గురించి చూద్దాం..

గూగుల్ పిక్సల్ 7ఏ.. దీనిలో 6.1ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, రిఫ్రెష్ రేట్ 90Hz ఉంటుంది. దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రధాన కెమెరా 64ఎంపీ కాగా, 13ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంటుంది. అలాగే 13ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇప్పుడు ఈ గూగుల్ పిక్సల్ 7ఏ ధరలోనే అలాంటి ఫీచర్లే ఉన్న ప్రత్యామ్నాయ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. అవేంటో తెలుసుకోండి..

వన్ ప్లస్ 11ఆర్.. గూగుల్ పిక్సల్ 7ఏ ఫోన్కి మంచి ప్రత్యామ్నాయం వన్ ప్లస్ 11ఆర్. దీనిలో 120Hz డిస్ ప్లే ఉంటుంది. అలాగే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 16జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమరీతో ఇది వస్తుంది. ఇది అత్యద్భుత పనితీరుని అందిస్తుంది. దీని వెనుకవైపు 64ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5,000ఎంఏహెచ్ ఉంటుంది. అలాగే 100వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999కాగా, 16జీబీ ర్యామ్, 256జీబీ వేరియంట్ ధర రూ. 44,999గా ఉంది.

ఇవి కూడా చదవండి

గూగుల్ పిక్సల్ 7.. ఈ ఫోన్ అమెజాన్ లో రూ. 45,250కి లభ్యమవుతోంది. దీనిలో 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే 90Hz రిఫ్రెష్ మెంట్ రేట్ తో ఉంటుంది. అలాగే దీనిలో జీ2 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 50ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో 4,270ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. గూగుల్ పిక్స్ 7ఏకు బెస్ట్ ప్రత్యామ్నాయం.

శామ్సంగ్ గేలాక్సీ ఏ 54.. దీనిలో 6.4 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ మెంట్ రేట్ ఉంటుంది. ఎక్సినోస్ 1380 చిప్ సెట్, 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 1టీబీ మైక్రో ఎస్డీ కార్డు ఉంటుంది. 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 32 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర ప్రస్తుతం అమెజాన్ లో రూ. 38,999గా ఉంది.

జియోమీ 12ప్రో.. ఈ ఫోన్ లో 6.73 అంగుళాల 2కే అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ మెంట్ రేట్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8జెన్ 1 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీర్యామ్ 256జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అలాగే ముందు వైపు 32ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 4,600ఎంఏహెచ్, 120వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 44,999గా ఉంది.

వివో వీ27 ప్రో.. దీనిలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్మెంట్ రేట్ ఉంటుంది. 8జీబీ, 12జీబీ ర్యామ్ సైజ్లలో లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్ 13పై పనిచేస్తుంది. 4,600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెట్ అప్ వస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని ధర అమెజానలో ప్రస్తుతం రూ. 37,999గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..