AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp New Features: వాట్సాప్‌లో 12 కొత్త ఫీచర్లు.. ఇకపై గ్రూప్ అడ్మిన్లకు ఫుల్ పవర్స్..

యూజర్ల ఆదరణకు తగినట్టే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకుంది. ముఖ్యంగా యూజర్లకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ఎప్పటకప్పుడు కొత్తకొత్త అప్‌డేట్స్‌ను కూడా అందిస్తుంది. దీంతో ఎక్కువమంది యూజర్లు వాట్సాప్ వైపు ఆకర్షితులవుతున్నారు. తాజా వాట్సాప్ కొత్తగా 12 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

WhatsApp New Features: వాట్సాప్‌లో 12 కొత్త ఫీచర్లు.. ఇకపై గ్రూప్ అడ్మిన్లకు ఫుల్ పవర్స్..
Whatsapp
Nikhil
|

Updated on: May 17, 2023 | 4:00 PM

Share

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతుంది.  ప్రతి ఫోన్‌లో కచ్చితంగా ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్ ఫారమ్ వాట్సాప్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా అందరూ వాట్సాప్‌ను వాడుతున్నారు. కేవలం మెసేజ్‌లను పంపడమేకాకుండా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాలతో పాటు స్టేటస్ పెట్టుకోవడం, గ్రూప్ చాట్స్ వంటి అనే ఫీచర్లు ఉండడంతో ఎక్కువమంది వాట్సాప్‌ను వాడుతున్నారు. యూజర్ల ఆదరణకు తగినట్టే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకుంది. ముఖ్యంగా యూజర్లకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ఎప్పటకప్పుడు కొత్తకొత్త అప్‌డేట్స్‌ను కూడా అందిస్తుంది. దీంతో ఎక్కువమంది యూజర్లు వాట్సాప్ వైపు ఆకర్షితులవుతున్నారు. తాజా వాట్సాప్ కొత్తగా 12 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫీచర్లు ఇంకా పరీక్షల దశలో ఉన్నాయని త్వరలోనే ఈ ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ తాజా అప్‌డేట్స్‌లో రానున్న చానెల్ ఫీచర్ ద్వారా యూజర్లు బ్రాడ్ కాస్ట్ చానెల్ ద్వారా మాట్లాడుకోవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫీచర్ త్వరలో వాట్సాప్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంటుందని అక్కడ సక్సెస్ అయితే సాధారణ యూజర్లకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ అప్‌డేట్‌తో తాజాగా రాబోయే ఫీచర్లేంటో ఓ సారి తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫీచర్లు ఇవే

వాట్సాప్ యూజర్ల యూసేజ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చడానికి వాట్సాప్ 12 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఫుల్‌-విడ్త్‌ మెసేజింగ్‌ ఇంటర్‌ఫేస్‌, వెరిఫికేషన్‌ స్టేటస్‌, నంబర్‌ ఆఫ్‌ ఫాలోవర్స్‌, మ్యూట్ నోటిఫికేషన్ బటన్, హ్యాండిల్స్, రియల్‌ ఫాలోవర్స్‌ కౌంట్‌, షార్ట్‌కట్స్‌, ఛానెల్ డిస్క్రిప్షన్‌, మ్యూట్ నోటిఫికేషన్ టోగుల్, విజిబిలిటీ స్టేటస్, ప్రైవసీ, రిపోర్టింగ్‌ వంటి ఫీచర్ల వల్ల వినియోగదారులు వాట్సాప్‌ను మరింత సమర్థవంతంగా వాడే అవకాశం ఉంటుంది.

గ్రూప్ అడ్మిన్లకు కొత్త ఫీచర్లు

ప్రస్తుత వాట్సాప్ అప్‌డేట్స్‌లో అడ్మిన్ రివ్యూ అనే కొత్త అప్‌డేట్‌ను అందిస్తుంది. ఈ ఫీచర్ వల్ల గ్రూప్ అడ్మిన్లకు అధిక అధికారాలు వస్తాయి. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు వారి గ్రూప్‌లను మెరుగ్గా మోడరేట్ చేసేలా సాయం చేస్తాయి. ఈ ఫీచర్‌ను ఎనెబుల్ చేసినప్పుడు గ్రూప్ సభ్యులు నిర్దిష్ట సందేశాలను గ్రూప్ అడ్మిన్‌కు నివేదించవచ్చు. ఒక అడ్మిన్ సందేశం అనుచితమైనది లేదా గ్రూప్ నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే సభ్యుడు దానిని నివేదించినప్పుడు సమూహంలోని ప్రతి ఒక్కరికీ దాన్ని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
తక్కువ సమయంలోనే ఎంతో రుచికరంగా చేసుకునే ఇన్‌స్టంట్ రెసిపీ ఇదీ!
తక్కువ సమయంలోనే ఎంతో రుచికరంగా చేసుకునే ఇన్‌స్టంట్ రెసిపీ ఇదీ!
తొడలు, పిక్కలను బలంగా మార్చే 5 అదిరిపోయే వ్యాయామాలు ఇవే!
తొడలు, పిక్కలను బలంగా మార్చే 5 అదిరిపోయే వ్యాయామాలు ఇవే!