UPI Payments: యూపీఐ యాప్స్ ద్వారా ఒకరికి పంపబోయి వేరొకరికి డబ్బు పంపారా? ఇలా చేస్తే మీ డబ్బు వెనక్కి…
ముఖ్యంగా యూపీఐ చెల్లింపులు ద్వారా పేమెంట్ చేసే వారు రెండు సాధారణ తప్పులు చేస్తున్నారు. వేరే వ్యక్తి సొమ్మును పంపడం ఒకటైతే.. పంపాల్సిన సొమ్ము కంటే ఎక్కువ పంపడం మరో తప్పుగా ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదని, తప్పుగా పంపిన డబ్బును సులభంగా తిరిగి పొందవచ్చు.
డిజిటల్ చెల్లింపులు గత కొన్నేళ్లుగా ట్రెండ్‌గా మారాయి. ముఖ్యంగా 2016లో డీమోనిటైజేషన్ తర్వాత ఏటీఎంల వద్ద రద్దీని నియంత్రించడానికి ఆన్‌లైన్ చెల్లింపులు సులభమైన ప్రత్యామ్నాయంగా మారాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా డిజిటల్ చెల్లింపులు సౌకర్యవంతంగా, సులభంగా మారాయి. అయితే ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ ఒకరికి పంపాల్సిన సొమ్ము ఇంకొకరికి పంపితే మాత్రం కొంత ఇబ్బందిగా మారుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ చెల్లింపులు ద్వారా పేమెంట్ చేసే వారు రెండు సాధారణ తప్పులు చేస్తున్నారు. వేరే వ్యక్తి సొమ్మును పంపడం ఒకటైతే.. పంపాల్సిన సొమ్ము కంటే ఎక్కువ పంపడం మరో తప్పుగా ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదని, తప్పుగా పంపిన డబ్బును సులభంగా తిరిగి పొందవచ్చు. ఈ సొమ్మును ఎలా తిరిగి పొందవచ్చో ఓ సారి తెలుసుకుందాం.
గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి యూపీఐ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ల కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే మన సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చేసిన లావాదేవీ వివరాలను తెలిపి ఫిర్యాదు చేయాలి. అలాగే మన సొమ్ము డెబిట్ అయిన బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కూడా కాల్ చేసి తప్పుడు లావాదేవీ గురించి ఫిర్యాదు చేయవచ్చు. అయితే తప్పుగా చెల్లించిన పక్షంలో ఫిర్యాదు చేసిన 48 గంటల్లోపు డబ్బును వాపసు చేయవచ్చని ఆర్‌బీఐ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. లావాదేవీ చేసిన మూడు రోజుల్లోపు ఫిర్యాదును నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ నెంబర్ కాల్ చేస్తే సరి
యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా తప్పు బ్యాంక్ ఖాతాకు చెల్లింపు జరిగినప్పుడు 18001201740కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత, సంబంధిత బ్యాంకుకు వెళ్లి, దానిలోని మొత్తం సమాచారంతో ఒక ఫారమ్‌ను పూరించి సాయం పొందవచ్చు. అయితే బ్యాంక్ సహాయం చేయడానికి నిరాకరిస్తే, దాని గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు సమయంలో అవసరమైన పీపీబీఎల్ నంబర్ ఉండాలి. అలాగే లావాదేవీకి సంబంధించిన సందేశాన్ని ఫోన్ నుండి తొలగించకూడదు. ఫిర్యాదు ఫారమ్‌లో అన్ని ఇతర వివరాలు, మీ ఫిర్యాదుతో పాటు ఈ నంబర్‌ను పేర్కొనడం మర్చిపోకూడదు.
ఎన్‌పీసీఐకు ఫిర్యాదు చేయడం ఇలా
అలాగే మీరు యూపీఐ సేవలను అందించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు తప్పు లావాదేవీ గురించి ఫిర్యాదు చేయవచ్చు. రిసీవర్ యూపీఐ ఐడీ, వారి ఫోన్ నంబర్, బదిలీ చేయబడిన మొత్తం, మీ ఖాతాకు సంబంధించిన యూపీఐ పిన్‌ను నమోదు చేసేటప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. వీటిలో ఏదైనా తప్పు జరిగితే మీరు రిసీవర్‌కు తప్పుడు మొత్తాన్ని పంపడం లేదా సరైన మొత్తాన్ని తప్పు వ్యక్తికి పంపడం వంటి వాటి ద్వారా అనవసరంగా మన డబ్బును కోల్పోవచ్చు. త్వరితగతిన చెల్లింపులు చేస్తున్నప్పుడు అక్షరదోషాలు సర్వసాధారణం. కాబట్టి వీటిని నివారించడం ఉత్తమం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..