YouTube: అలాంటి ఆటలు ఇక్కడ సాగవు.. స్పష్టం చేసిన యూట్యూబ్..
ఇదంతా ఇలా ఉంటే ఈ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఇటీవల వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. డీప్ ఫేక్ వీడియో అనే టెక్నాలజీ సినిమా ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. వేరే వ్యక్తుల శరీరాలకు సెలబ్రిటీల మొహాలను జోడించి రూపొందించిన వీడియోలు ఆందోళనకు...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడీ పదం టెక్ ప్రపంచాన్ని శాసిస్తోన్న విషయం తెలిసిందే. అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ అనివార్యంగా మారింది. ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో యూజర్లకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా బడా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇదంతా ఇలా ఉంటే ఈ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఇటీవల వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. డీప్ ఫేక్ వీడియో అనే టెక్నాలజీ సినిమా ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. వేరే వ్యక్తుల శరీరాలకు సెలబ్రిటీల మొహాలను జోడించి రూపొందించిన వీడియోలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి వీడియోలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం నడుం బిగించిన విషయం తెలిసిందే.
అయితే కొన్ని కంపెనీలు సైతం ఇలాంటి వాటిపై దృష్టిసారిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ ముందడుగు వేసింది. ఏఐ సహాయంతో రూపొందించిన ఫేక్ వీడియోలను అరికట్టే క్రమంలో యూట్యూబ్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించే వీడియోలకు యూట్యూబ్‌లో స్థానం లేదని తేల్చి చెప్పింది. ఏఐతో రూపొందించిన వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే వాటిని తొలగించడంతో పాటు.. వాటిని లేబుల్ చేయనున్నట్లు యూట్యూబ్ తెలిపింది.
ఇక ఒకవేళ కంటెంట్ క్రియేటర్లు ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన వీడియోలను అప్‌లోడ్ చేస్తే.. ఆ విషయాన్ని ప్రకటించాల్సి ఉంటుందని, అలా చేయకపోతే ఆ వీడియోలను తొలగించనున్నట్లు యూట్యూబ్ తెలిపింది. ఈ సందర్భంగా యూట్యూబ్ బ్లాగ్‌లో మార్గదర్శకాలపై సమాచారం ఇచ్చింది. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్న సమయంలో యూజర్లకు సదరు వీడియో ఏఐ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలియజేస్తుంది.
వీడియో డిస్క్రిప్షన్‌లో ఏఐ లేబుల్ ఆప్షన్‌ను ఇవ్వనున్నారు. ఈ కొత్త మార్తదర్శకలను పాటించని కంటెంట్ క్రియేటర్లపై చర్యలు తప్పవని యూట్యూబ్ స్పష్టం చేసింది. వీడియోలను తొలగించడంతో పాటు ఆయా ఛానెల్స్‌కు సంబంధించి మానిటైజేషన్ నిలిపివేస్తామని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే యూబ్యూట్ ఇటీవల యాడ్ బ్లాకర్స్‌ను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. దీంతో బ్లాకర్ ద్వారా ఎవరైనా యాడ్స్‌ను బ్లాక్ చేసి వీడియోలు చేస్తే.. మూడుసార్లు వార్నింగ్ ఇచ్చి.. అనంతరం సంబంధిత అకౌంట్‌ను బ్లాక్ చేస్తామని యూట్యూబ్ ప్రకటించిన విషయం విధితమే.