Yawning: ఎవరికైనా ఆవలింతలు వస్తే ఇతరులకు కూడా ఎందుకు వస్తాయి..? దాని వెనుకున్న కారణాలు ఇవే..!
Yawning: ఇతరులను ఆవలిస్తున్నప్పుడు మీరు కూడా ఆవలిస్తుంటారు. అలా ఎందుకు ఆవలింతలు వస్తాయో మీరు ఎప్పుడైనా గమనించారా..? చాలా మంది ఆవులించడం అనేది నిద్రలేమి, నీరసాన్ని సూచిస్తుందని..
Yawning: ఇతరులను ఆవలిస్తున్నప్పుడు మీరు కూడా ఆవలిస్తుంటారు. అలా ఎందుకు ఆవలింతలు వస్తాయో మీరు ఎప్పుడైనా గమనించారా..? చాలా మంది ఆవులించడం అనేది నిద్రలేమి, నీరసాన్ని సూచిస్తుందని అనుకుంటారు. అయితే దీనికి కూడా ఒక సైన్స్ ఉంది. ఇటీవల కాలంలో ఆవలింతలపై ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం పరిశోధన చేసింది. ఇది నిద్రకు సంబంధించినది అనే వాదనను పరిశోధన ఫలితాలు తోసిపుచ్చాయి. ఆవలింత ఎందుకు వస్తుంది. ఒకరు ఆవలింతలు తీస్తే దానిని చూసిన వారు కూడా ఆవలించడంపై వివరాలు వెల్లడించారు పరిశోధకులు. ఒక వ్యక్తి డ్రైవర్ పక్కన సీటులో కూర్చొని ఆవులిస్తే, అతన్ని చూడగానే డ్రైవర్ ఆవలించడం ప్రారంభిస్తాడు. అటువంటి పరిస్థితిలో అతని మెదడు అతనిని నిద్రపోయేలా చేస్తుంది. అతని స్వల్ప నిద్ర ప్రమాదానికి కారణమవుతుంది. అందువల్ల డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి ఆవలించడం లేదా నిద్రపోవడం చేయకూడదు.
మెదడు తనను తాను చల్లగా ఉంచుకునేందుకు.. ఆవలింత మెదడుకు సంబంధించినదని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నివేదిక చెబుతోంది. మెదడు తనను తాను చల్లగా ఉంచుకోవడానికి ఇలా చేస్తుందని వెల్లడించారు. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అదే సమయంలో, శీతాకాలంలో శరీర ఉష్ణోగ్రత బయట కంటే ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మెదడు మరింత ఆక్సిజన్‌ను లాగడం ద్వారా దాని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
ఆవలింతకు.. వాతావరణానికి సంబంధం ఉందా..?
ఆవలింతకు వాతావరణానికి కూడా సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు ప్రిన్స్‌టన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. 180 మంది ఆవులించడాన్ని గుర్తించేందుకు పరిశోధన చేశారు. వీరిలో వేసవిలో 80 మందిని, శీతాకాలంలో 80 మందిని పరిశోధనలో చేర్చారు. వీటికి సంబంధించిన పరిశోధనా నివేదికను పోల్చిచూసినప్పుడు వేసవిలో కంటే చలికాలంలోనే ఎక్కువ మంది ఆవలిస్తున్నట్లు తేలింది.
ఎదుటి వ్యక్తులను చూసే ఆవలించడం.
2004లో జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. 50 శాతం మంది తమ ఎదుటి వ్యక్తి ఇలా చేయడం చూసి ఆవలించడం ప్రారంభిస్తారని తేలింది. అలాగే ఇతరులను చూసిన తర్వాత మనుషులు ఎందుకు ఆవలిస్తారో తెలుసుకునేందుకు మ్యూనిచ్‌లోని సైకియాట్రిక్ యూనివర్సిటీ హాస్పిటల్ 300 మందిపై పరిశోధన చేసింది. పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు ఆవలిస్తూ వీడియోలు చూపించారు. దీని తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వీడియో చూస్తున్నప్పుడు వ్యక్తులు 1 నుండి 15 సార్లు ఆవులించారని పరిశోధన నివేదిక చెబుతోంది. ఒక వ్యక్తి ఆవులించడం చూసినప్పుడల్లా అతని మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని ప్రత్యక్ష సంబంధం మానవ మెదడుతో ఉంటుంది. మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ సక్రియం అయినప్పుడు, అది ఇతరులను అనుకరించమని మానవులను ప్రేరేపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి