Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తున్నారా.? అయితే ఈ అదిరిపోయే ఫీచర్‌ మీకోసమే..

Instagram Reels: యూత్‌ను ఎక్కువగా ఆకర్షించే సోషల్‌ మీడియా సైట్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ది మొదటి స్థానం. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటుంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు అంత పాపులారిటీ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లను ఎక్కువగా ఆకర్షించిన ఫీచర్లలో...

Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తున్నారా.? అయితే ఈ అదిరిపోయే ఫీచర్‌ మీకోసమే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 03, 2022 | 5:42 PM

Instagram Reels: యూత్‌ను ఎక్కువగా ఆకర్షించే సోషల్‌ మీడియా సైట్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ది మొదటి స్థానం. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటుంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు అంత పాపులారిటీ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లను ఎక్కువగా ఆకర్షించిన ఫీచర్లలో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ (Reels) ప్రధానమైంది. తమలోని ప్రతిభను ప్రదర్శించుకోవడానికి యూజర్లకు రీల్స్‌ మంచి వేదికగా మారింది. ముఖ్యంగా భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం విధించిన తర్వాత రీల్స్‌కు ఎక్కడలేని క్రేజ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో రీల్స్‌కు వస్తోన్న ఆదరణను మరింత క్యాష్‌ చేసుకునే ఉద్దేశంతో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు మరో వెసులుబాటును తీసుకురానుంది. రీల్స్‌ నిడివిని 90 సెకన్ల వరకు పొడగించనున్నారు.

దీని ద్వారా యూజర్లు మరింత మెరుగైన వీడియోలను అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం లభిస్తుందని మెటా యాజమాన్యం తెలిపింది. అంతేకాకుండా రీల్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను కూడా అందించింది. ఈ రీల్స్‌కు ఇతర వీడియోల నుంచి తమ సొంత ఆడియోను కూడా యాడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ క్రియేటర్ల కోసం పోల్స్‌ నిర్వహించుకునే అవకాశం కూడా ఇచ్చారు.

దీంతో రీల్స్‌ చేసే వాళ్లు ప్రేక్షకులకు నుంచి ఏం ఆశిస్తున్నారు.? ఎలాంటి వీడియోలు చూడడానికి ఇష్టపడుతున్నారు. లాంటి వివరాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా రీల్స్‌ చేసుకోవచ్చన్నమాట. దీంతో అటు క్రియేటర్లకు ఎక్కువ వ్యూస్‌ రావడంతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా తాము కోరుకుంటున్న వీడియోలను చూసే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..