Vitamins Deficiency: మీరు రాత్రి పడుకునేటప్పుడు కాళ్లను కదిలించే అలవాటు ఉందా? ఈ విటమిన్ల లోపం కారణం కావచ్చు

Subhash Goud

Subhash Goud |

Updated on: Jun 03, 2022 | 2:53 PM

Vitamins Deficiency: మీరు పోషకాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోకపోతే విటమిన్ లోపం మొదలవుతుంది. విటమిన్ ఏ లోపాన్ని తీర్చడం ద్వారా మీరు నిద్రలో కాళ్ళు వణుకుతున్న అలవాటును చాలా..

Vitamins Deficiency: మీరు రాత్రి పడుకునేటప్పుడు కాళ్లను కదిలించే అలవాటు ఉందా? ఈ విటమిన్ల లోపం కారణం కావచ్చు
Vitamins Deficiency

Vitamins Deficiency: మీరు పోషకాలు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోకపోతే విటమిన్ లోపం మొదలవుతుంది. విటమిన్ ఏ లోపాన్ని తీర్చడం ద్వారా మీరు నిద్రలో కాళ్ళు వణుకుతున్న అలవాటును చాలా వరకు అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి. విటమిన్‌ లోపం వల్ల ఒళ్లు నొప్పులు,చిరాకు కూడా ఉంటుంది. రాత్రి నిద్రిస్తున్నప్పుడు కాళ్లను కదిలించడం (రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్) కూడా సమస్యగా పరిగణించబడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా దీని వలన ఇబ్బంది పడతారు. అయితే శరీరంలో విటమిన్లు లేకపోవటం వలన మీరు దీని బారిన పడవచ్చు. ఈ సమస్య మీ రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వల్ల రావచ్చు. ఈరోజుల్లో చాలా మంది బయటి ఆహారాన్ని తీసుకుంటారు.

విటమిన్ B12 లోపం

శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల రక్తప్రసరణ దెబ్బతింటుందని నిపుణులు వివరిస్తున్నారు. శరీరంలో రక్తప్రసరణలో అడ్డంకులు ఏర్పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. రాత్రిపూట నిద్రపోయిన తర్వాత కూడా వారి కాళ్ళను కదిలిస్తారు. విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి మీరు వేరుశెనగ, బీన్స్, బచ్చలికూర వంటి ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్ సి లోపం:

శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల మీ రక్త ప్రసరణ కూడా ప్రభావితమవుతుంది. నిజానికి, పాదాల నొప్పి, ఐరన్‌ లోపం వల్ల వస్తుంది. ఐరన్‌ లోపం వల్ల పాదాలలో నొప్పి ఉంటుంది.

విటమిన్ డి లోపం:

ఈ రోజుల్లో శరీరంలో విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయని అందరికి తెలిసిందే. శరీరానికి విటమిన్‌ డి ఎంతో అవసరమని వైద్యులు కూడా పదేపదే చెబుతుంటారు. దీని వల్ల పాదాలు, చేతులు లేదా కీళ్లలో నొప్పి మొదలవుతుంది. శరీరంలో ఈ ముఖ్యమైన విటమిన్ లోపం కారణంగా, కండరాల ఉద్రిక్తత పెరుగుతుంది. మీరు సూర్యకాంతి ద్వారా శరీరంలో డి విటమిన్ లోపాన్ని తీర్చవచ్చు. ఇది కాకుండా, ఆహారం ద్వారా కూడా డి విటమిన్‌ అందుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu