Jaggery: బెల్లం అధికంగా వాడుతున్నారా.. అయితే సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..! జాగ్రత్త..
కొందరు వ్యక్తులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు అనేక రకాల ఆహారాలను ప్రయత్నిస్తారు. అయితే, కొన్ని ప్రయత్నాలు ప్రయోజనానికి బదులుగా హాని తలపెడతాయి. ఇలాంటి వాటిలో పాలు, టీ లో బెల్లం కలుపుకోవడం ఒకటిగా చెబుతున్నారు..
కొందరు వ్యక్తులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు అనేక రకాల ఆహారాలను ప్రయత్నిస్తారు. అయితే, కొన్ని ప్రయత్నాలు ప్రయోజనానికి బదులుగా హాని తలపెడతాయి. ఇలాంటి వాటిలో పాలు, టీ లో బెల్లం కలుపుకోవడం ఒకటిగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మితమెప్పుడూ మేలు చేస్తుంది.. అతి ఎప్పుడూ హాని చేస్తుందని పెద్దలు అంటారు. ఈ సూచన బెల్లం విషయంలోనూ వర్తిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం పాలు, టీ లో బెల్లం వేసుకుని అతిగా తాగొద్దని చెబుతున్నారు. అలా చేస్తే సమస్యలు ఎదుర్కోక తప్పదంటున్నారు. టీలో తీపి కావాలంటే బెల్లం బదులు.. మిశ్రిగా పిలిచే చెక్కర పటికాలను వాడటం మంచిదంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. ఇది చల్లదనాన్ని కలిగి ఉంటుంది. అయితే దీన్ని కూడా మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. బెల్లం కలిపిన పాలను తీసుకోవడం వలన ఉదర సబంధిత సమస్యలు తలెత్తుతాయట. కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, ఇతర ఉదర సంబంధిత సమస్యలు వస్తాయట. అలాగే బెల్లం కలిపిన పాలు, టీ తాగడం వలన బరువు పెరిగే ప్రమాదం వుందంటున్నారు. బెల్లం అధికంగా తీసుకుంటే శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందట. 10 గ్రాముల బెల్లంలో 9.7 గ్రాముల చక్కెర కలిగి ఉంటుందట. అందుకే దీనికి బదులుగా గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగడం మంచిదంటున్నారు నిపుణులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

