Whatsapp: మరో ఆసక్తికరమైన ఫీచర్‌ తీసుకున్న రానున్న వాట్సాప్‌.. ఆ ఫీచర్‌తో వస్తోన్న తొలి మెసేజింగ్‌ యాప్‌ ఇదే..

Whatsapp: మెసేజింగ్ యాప్‌ అంటే టక్కున గుర్తొచ్చే వాటిలో వాట్సాప్‌ ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్‌లలో (Messaging App) వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉండడానికి ప్రధాన కారణం ఇదే. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుకూలంగా...

Whatsapp: మరో ఆసక్తికరమైన ఫీచర్‌ తీసుకున్న రానున్న వాట్సాప్‌.. ఆ ఫీచర్‌తో వస్తోన్న తొలి మెసేజింగ్‌ యాప్‌ ఇదే..
Follow us

|

Updated on: Jun 02, 2022 | 2:55 PM

Whatsapp: మెసేజింగ్ యాప్‌ అంటే టక్కున గుర్తొచ్చే వాటిలో వాట్సాప్‌ ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్‌లలో (Messaging App) వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉండడానికి ప్రధాన కారణం ఇదే. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుకూలంగా ఫీచర్లు (Features) తీసుకొస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ అని చెప్పొచ్చు. మరే ఇతర యాప్స్‌లో లేని ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఎదుటి వారికి పంపిన మెసేజ్‌లను ఎడిట్‌ చేసే ఆప్షన్‌ ఇప్పటి వరకు ఏ మెసేజింగ్ యాప్‌లో లేదని విషయం తెలిసిందే. ఒకవేళ మెసేజ్‌లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే సదరు మెసేజ్‌ను ‘డిలెట్‌ ఫర్‌ ఆల్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మళ్లీ కొత్త మెసేజ్‌ను పంపించాల్సి ఉంటుంది. అలాకాకుండా పంపిన మెసేజ్‌లో చేంజేస్‌ చేసుకునే వెసులుబాటు ఉంటే భలే ఉంటుంది కదూ! వాట్సాప్‌ ఇప్పుడు ఇలాంటి ఫీచర్‌పైనే పనిచేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వాట్సాప్‌ బెటా ఇన్ఫోలో కథనాన్ని ప్రచురించింది. ఇన్ఫో, కాపీతో పాటు అదనంగా ‘ఎడిట్‌’ అనే ఆప్షన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Whatsapp

ఇవి కూడా చదవండి

ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, డెస్క్‌టాప్‌ బీటా వెర్షన్స్‌లో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఫీచర్‌ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే ఏదైనా వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఎగ్జిట్ అయితే అందరికీ అలర్ట్‌ చూపించకుండా, కేవలం అడ్మిన్‌కు మాత్రమే తెలిసేలా ఓ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చే పనిలో ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..