Smart Phones: ఈ 4 స్మార్ట్‌ఫోన్ల ధర 5000 రూపాయలు మాత్రమే.. అయితే 10,15 వేల ఖర్చు ఎందుకు..?

Smart Phones: ఇంటర్నెట్ ప్రపంచంలో 4G ఒక సంచలనం. దేశంలో 4జీ స్పీడ్ ఇంటర్నెట్‌ను చాలామంది ఉపయోగిస్తున్నారు. మీరు కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే

Smart Phones: ఈ 4 స్మార్ట్‌ఫోన్ల ధర 5000 రూపాయలు మాత్రమే.. అయితే 10,15 వేల ఖర్చు ఎందుకు..?
Smart Phones
Follow us

|

Updated on: Jun 01, 2022 | 6:32 PM

Smart Phones: ఇంటర్నెట్ ప్రపంచంలో 4G ఒక సంచలనం. దేశంలో 4జీ స్పీడ్ ఇంటర్నెట్‌ను చాలామంది ఉపయోగిస్తున్నారు. మీరు కొత్త 4G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే 10-15 వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లో రూ.5,000 కంటే తక్కువ ధరకే అనేక 4G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. Xiaomi, Lava, Samsung వంటి పెద్ద బ్రాండ్‌లు వినియోగదారుల కోసం రూ. 5,000 లోపు స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. ఈ ఫోన్లు వీడియోలు చూడటానికి, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, రోజువారీ పనులను నిర్వహించడానికి ఉపయోగించవచ్చు.

Xiaomi Redmi 2

Xiaomi స్మార్ట్‌ఫోన్ 4.7 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. రెడ్‌మి 2లో క్వాల్కమ్‌ స్నాప్ డ్రాగన్‌ 410 చిప్‌సెట్, 1 జీబీ ర్యామ్‌ 8 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ పొందుతారు. ఈ 4G స్మార్ట్‌ఫోన్ 8 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. వినియోగదారులు ఇందులో 2200 mAh బ్యాటరీని పొందుతారు. ఈ ఫోన్ ధర రూ.4,990.

ఇవి కూడా చదవండి

లావా Z1S

లావా Z1Sలో యూజర్లు 5.0 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే పొందుతారు. Unisoc చిప్‌సెట్, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. యూజర్లు ఈ ఫోన్‌ను రూ.4,699కి పొందుతారు. ఈ ఫోన్‌లో 5 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగదారులు 3100 mAh బ్యాటరీని పొందుతారు.

Samsung Galaxy M01 కోర్

Samsung Galaxy M01 కోర్ 5.3 అంగుళాల PLS TFT LCD డిస్ప్లేతో వస్తుంది. వినియోగదారులు మీడియాటెక్ చిప్‌సెట్‌తో 1 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ పొందుతారు. ఈ 4G స్మార్ట్‌ఫోన్ 3000 mAh బ్యాటరీ ఉంటుంది. దీని వెనుక భాగంలో 8 ఎంపీ కెమెరా, ముందు భాగంలో 2 ఎంపీ కెమెరా ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 4,999కి వస్తుంది.

రిలయన్స్ జియోఫోన్ నెక్స్ట్

రిలయన్స్ జియోఫోన్ నెక్స్ట్ లో 5.45 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్కమ్‌ స్నాప్ డ్రాగన్‌ 215 చిప్‌సెట్‌తో పాటు 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. రూ.4,434కే ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తుంది. ఈ ఫోన్ 13 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగదారులు 3500 mAh బ్యాటరీని పొందుతారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..