Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని ప్లాన్‌ చేస్తే జాగ్రత్త.. ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..!

Second Hand Car: కొత్త కార్ల మాదిరిగానే సెకండ్ హ్యాండ్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని ప్లాన్‌ చేస్తే జాగ్రత్త.. ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..!
Second Hand Car
Follow us

|

Updated on: Jun 01, 2022 | 5:44 PM

Second Hand Car: కొత్త కార్ల మాదిరిగానే సెకండ్ హ్యాండ్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. చాలా సెకండ్ హ్యాండ్ కార్లు మంచి కండిషన్‌లో ఉంటాయి. అంతేకాకుండా మంచి ఫీచర్లతో సరసమైన ధరలో లభిస్తాయి. అయితే సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేటప్పుడు కొన్ని అంశాలని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేదంటే మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

కారు డాక్యుమెంట్లు తనిఖీ చేయండి: సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు ఆ వాహనం పేపర్‌లను తనిఖీ చేయండి. ఛాసిస్, ఇంజిన్ నంబర్‌లను చెక్ చేయండి. ఇన్సూరెన్స్‌ పత్రాలు మొదలైనవాటిని క్షణ్ణంగా పరిశీలించాలి. వీలైతే కారు ఫిల్టర్‌లు మొదలైనవాటిని కూడా చూడాల్సి ఉంటుంది.

కారు ఇంజిన్‌ను తనిఖీ చేయండి : కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి దాని పెయింట్, కండిషన్‌ మాత్రమే కాదు ఇంజిన్ పనితీరు చాలా ముఖ్యం. అందుకే కారు ఇంజిన్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరమైతే మెకానిక్ సహాయం తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

బూట్ స్పేస్, బానెట్‌ను తనిఖీ చేయండి: కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కారు బూట్ స్పేస్, బానెట్‌ను ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కారు ఏమైనా డ్యామేజ్‌ అయితే లోపల చూడటం ద్వారా తెలుస్తుంది.

టైర్ల పరిస్థితిని చెక్‌ చేయండి: కారు టైర్లపై ఓ లుక్కేయండి. తరచుగా సెకండ్ హ్యాండ్ కార్లలో చాలా మంది సెకండ్‌ హ్యాండ్‌ కార్లని అమర్చుతారు. ఎందుకంటే కొత్త టైర్ల కోసం దాదాపు 20 వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.

కొన్ని కిలోమీటర్ల వరకు డ్రైవ్‌ చేయండి: సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు అది పాత కారని మరిచిపోకండి. ఇంజిన్‌లో సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కారును కొన్ని కిలోమీటర్ల దూరం నడపడం ముఖ్యం. కారును 100 వేగంతో నడపాలని గుర్తుంచుకోండి. అప్పుడే ఏమైనా సమస్యలు ఉంటే బయటపడతాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Articles
ఇన్‌స్టా పోస్టుతో హంతకుల చేతికి అడ్రస్.. మోడల్‌ దారుణ హత్య!
ఇన్‌స్టా పోస్టుతో హంతకుల చేతికి అడ్రస్.. మోడల్‌ దారుణ హత్య!
USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
USAలోనూ 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం..
శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం..
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
పబ్బులో అర్ధరాత్రి అసభ్య కార్యకలాపాలు.. అడ్డంగా బుక్కైన 100 మంది
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఇప్పుడు కష్టం.. ఇక సమ్మర్‌ అయ్యాకే.!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో బంగారు భవిష్యత్ సాధ్యం
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
'చంద్రబాబు - లోకేష్ జైలుకు వెళ్ళటం ఖాయం'.. లక్ష్మీ పార్వతి
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..