AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Batteries: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు కొత్త BIS మార్గదర్శకాలు.. ప్రాథమిక నివేదిక ఆధారంగా కేంద్రం చర్యలు..

EV Batteries: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగటం, పేలుళ్ల ఘటనలు కొనసాగుతున్నందున ప్రభుత్వం వీటిని నిరోధించేందుకు రంగంలోకి దిగింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే ఈవీ బ్యాటరీల విషయంలో BIS ప్రమాణాలను ప్రవేశపెడుతోంది.

EV Batteries: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు కొత్త BIS మార్గదర్శకాలు.. ప్రాథమిక నివేదిక ఆధారంగా కేంద్రం చర్యలు..
Ev Fire
Ayyappa Mamidi
|

Updated on: Jun 01, 2022 | 1:27 PM

Share

EV Batteries: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగటం, పేలుళ్ల ఘటనలు కొనసాగుతున్నందున ప్రభుత్వం వీటిని నిరోధించేందుకు రంగంలోకి దిగింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే ఈవీ బ్యాటరీల విషయంలో BIS ప్రమాణాలను ప్రవేశపెడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే బ్యాటరీల BIS ప్రమాణాలు “పరిమాణం, కనెక్టర్‌లు, స్పెసిఫికేషన్, సెల్‌ల కనీస నాణ్యత, బ్యాటరీ సామర్థ్యం”ని పరిశీలిస్తాయి. దశలవారీగా ఈ పద్ధతిని నాలుగు చక్రాల వాహనాల్లో సైతం అమలు చేసేందుకు ప్రణళికలను రచిస్తోంది. బ్యాటరీ ప్యాక్‌లు, మాడ్యూల్స్ డిజైన్లతో సహా బ్యాటరీల్లో తీవ్రమైన లోపాలను ప్రాథమిక నివేదికలు కనుగొన్నందున.. EV బ్యాటరీల కోసం BIS మార్గదర్శకాలను తీసుకురావడానికి బ్యాటరీ పరిశ్రమ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

దీనికి ముందు NITI ఆయోగ్ చర్చా పత్రంలో కూడా జాతీయ బ్యాటరీ స్వాపింగ్ విధానానికి మొదటి అడుగుగా BIS ప్రమాణాల అవసరాన్ని నొక్కి చెప్పింది. EV అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోబ్ కమిటీ నుంచి ప్రాథమిక ఫలితాలు ప్రకారం.. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అగ్ని ప్రమాదాల్లో బ్యాటరీ సెల్స్ లేదా డిజైన్‌లో సమస్యలు ఉన్నట్లు గుర్తించాయి. ఈ-స్కూటర్లలో మంటలు, బ్యాటరీ పేలుళ్ల వరుస ఘటనల నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.

నిపుణులు దాదాపు అన్ని EV ఫైర్ యాక్సిడెెంట్ ఘటనల్లో బ్యాటరీ సెల్‌తో పాటు బ్యాటరీ డిజైన్‌లో లోపాలను గుర్తించారు. ప్రభుత్వం ఇప్పుడు EVల కోసం కొత్త నాణ్యత-కేంద్రీకృత మార్గదర్శకాలపై దృష్టి సారించింది. అవి త్వరలో అమలులోకి రానున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ EV అగ్ని ప్రమాదాలను పరిశోధించడానికి బాధ్యత వహించిన డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) బ్యాటరీల్లో తీవ్రమైన లోపాలను కనుగొంది. ఒకినావా ఆటోటెక్, ప్యూర్ EV, జితేంద్ర ఎలక్ట్రిక్ వెహికల్స్, ఓలా ఎలక్ట్రిక్, బూమ్ మోటార్స్ వంటి ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారులు “ఖర్చులను తగ్గించుకునేందుకు తక్కువ-గ్రేడ్ మెటీరియల్స్ ను” ఉపయోగించినందునే లోపాలకు కారణంగా వారి పరిశోధనల్లో తేలింది. దీనిని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.