AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp New Features: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడిక మీ మెసెజ్‌లు మరింత సురక్షితం.. అదెలాగంటే..

WhatsApp New Features: వాట్సాప్‌లో ప్రస్తుతం చాలా కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. తాజాగా వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్..

WhatsApp New Features: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇప్పుడిక మీ మెసెజ్‌లు మరింత సురక్షితం.. అదెలాగంటే..
Whatsapp
Shiva Prajapati
|

Updated on: Mar 12, 2021 | 9:59 PM

Share

WhatsApp New Features: వాట్సాప్‌లో ప్రస్తుతం చాలా కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. తాజాగా వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందించబోతోంది. అదేంటంటే చాట్ బ్యాకప్స్‌కి కూడా పాస్‌వర్డ్ పెట్టుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా అంటే మీ చాట్స్‌ని బ్యాకప్ చేసినప్పుడు పాస్‌వర్డ్ సెట్ చేయాలి. మళ్లీ మీరు ఆ చాట్స్ రీస్టోర్ చేయాలనుకుంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌‌ ప్రయోగదశలో ఉంది. కాగా, ఈ ఫీచర్ వాట్సాప్‌ ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో మాత్రమే పని చేస్తుంది.

ప్రస్తుతం వాట్సాప్‌లోని చాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ లేదు. దాంతో ముఖ్యమైన చాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం వాట్సప్.. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది. పాస్‌వర్డ్ సెట్ చేస్తే ఆ చాట్స్‌ని రీస్టోర్ చేయాలంటే పాస్‌వర్డ్ తప్పనిసరి. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు బీటా యూజర్ అయితే మీ వాట్సాప్‌ ను అప్‌డేట్ చేసి ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. బీటా యూజర్లు సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించిన తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురావాలని వాట్సప్ యాజమాన్యం భావిస్తోంది.

ఇదొక్కటే కాదు.. త్వరలోనే మరిన్ని ఇంట్రస్టింగ్ ఫీచర్స్‌ని తీసుకురావాలని వాట్సప్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ టైమర్‌ని మార్చబోతోంది. ప్రస్తుతం వారం రోజులు మాత్రమే టైమ్ సెట్ చేయొచ్చు. అలాగే వాట్సాప్‌ 24 గంటల ఫీచర్‌ని టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ఆన్ చేస్తే వాట్సప్‌లోని మెసేజెస్ 24 గంటల్లోగా ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. ప్రస్తుతం వారం రోజుల పాత మెసేజెస్ డిలిట్ అవుతాయి. త్వరలో 24 గంటల్లోనే పాత మెసేజెస్ డిలిట్ చేయొచ్చు.

Also read:

GATE 2021 Results: మార్చి 22న గేట్ -2021 ఫలితాలు.. మీ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోండి.. ఫుల్ గైడెన్స్ మీకోసం..

Assembly Session: సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి.. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ పోచారం సమీక్ష