AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌.. అచ్చం గూగుల్‌ మీట్‌లాగే స్క్రీన్‌ షేరింగ్ ఆప్షన్‌.

ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఏర్పడింది. ఇంతటీ కాంపిటేషన్‌లోనూ వాట్సాప్‌కు ఏ మాత్రం ఆదరణ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మెసేజ్‌ ఎడిట్‌, చాట్‌ లాక్‌ వంటి వినూత్న ఫీచర్లను తీసుకొచ్చిన..

Whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌.. అచ్చం గూగుల్‌ మీట్‌లాగే స్క్రీన్‌ షేరింగ్ ఆప్షన్‌.
Whatsapp
Narender Vaitla
|

Updated on: May 28, 2023 | 8:35 AM

Share

ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఏర్పడింది. ఇంతటీ కాంపిటేషన్‌లోనూ వాట్సాప్‌కు ఏ మాత్రం ఆదరణ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మెసేజ్‌ ఎడిట్‌, చాట్‌ లాక్‌ వంటి వినూత్న ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. వీడియో కాలింగ్‌ స్క్రీన్‌ షేరింగ్‌ ఆప్షన్‌ను వాట్సాప్‌ తీసుకొస్తోంది. సాధారణంగా జూమ్‌, గూగుల్‌ మీట్‌ వంటి యాప్స్‌లో ఈ స్క్రీన్‌ షేరింగ్ ఆప్షన్‌ ఉంది.

ఆఫీస్‌ మీటింగ్‌, కానీ మరే ఇతర సమావేశాల్లోనైనా ఒక యూజర్‌ ఈ ఆప్షన్‌ ద్వారా తన స్క్రీన్‌ను గ్రూప్‌లో ఉన్న వారందరికీ షేర్‌ చేసే అవకాశం ఉంటుంది. అచ్చంగా ఇలాంటి ఫీచర్‌నే వాట్సాప్‌ సైతం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొందరు బీటా టెస్టర్లకు వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఎవరితోనైనా వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో మన మొబైల్‌ స్క్రీన్‌ను అవతలి వ్యక్తికి షేర్‌ చేసే అవకాశం లభించనుంది.

ఇందుకోసం స్క్రీన్‌ అడుగు భాగంలో కొత్తగా స్క్రీన్‌ షేరింగ్‌ బటన్‌ను వాట్సాప్‌ ఇవ్వనుంది. ఈ బటన్‌ను క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌లో చేసే ప్రతిదీ రికార్డు అవ్వడంతో పాటు అవతలి వ్యక్తికి షేర్‌ అవుతుంది. దీనికి యూజర్‌ అనుమతి తప్పనిసరి. ఇదిలా ఉంటే గ్రూప్‌ వీడియో కాల్‌లో ఎక్కువ మంది యూజర్లు ఉంటే స్క్రీన్‌ షేర్‌ ఆప్షన్‌ పనిచేయకపోవచ్చని తెలుస్తోంది. అలాగే పాత ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ ఉన్న ఫోన్లలోనూ ఈ ఫీచర్‌ అందుబాటులోకి రాకపోవచ్చని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..