AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానానికి ఇది ఎందుకంత ముఖ్యం

Plane Black Box: ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. రెస్క్యూ పూర్తయిన వెంటనే దాన్ని వెలికితీస్తారు. అది దొరికిన తరువాత బ్లాక్ బాక్స్‌ను డిజీసీఏ లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ మెమొరీ డేటా..

Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానానికి ఇది ఎందుకంత ముఖ్యం
Subhash Goud
|

Updated on: Jun 13, 2025 | 1:18 PM

Share

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాలంటే కీలక సాక్ష్యం బ్లాక్ బాక్స్. బ్లాక్ బాక్స్‌లోని డేటాను విశ్లేషించడం ద్వారా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కచ్చితమైన కారణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. విమానంలో జరిగే ప్రతీది బ్లాక్‌ బాక్స్‌లో రికార్డ్ రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు. పైలట్ల అనౌన్స్‌మెంట్, ప్రైవేట్‌ సంభాషణలు రికార్డ్. సాధారణంగా విమానాల్లోని బ్లాక్ బాక్స్‌, కంప్యూటర్ హార్డ్‌డిస్క్ లాంటిది. విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్.

దీని వల్లనే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తోంది. విచారణ అధికారులూ ఈ బ్లాక్‌ బాక్స్‌పైనే ఆధారపడుతుంటారు. విమానంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డ్ చేసుకుంటుంది. కేవలం కాక్‌పిట్‌లోని సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్‌మెంట్, పైలట్లు ప్రైవేట్‌గా జరిపే సంభాషణలను సైతం రికార్డ్ చేస్తుంది. విమానం బయలు దేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాక ప్రతీది ఇందులో రికార్డ్ అవుతుంది.

బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?

ప్రతి కమర్షియల్ విమానంలో రెండు బ్లాక్‌ బాక్స్‌లు ఉంటాయి. మొదటిది ప్లైట్ డేటా రికార్డర్, విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, పైలట్ల సంభాషణలు, విమానంలో ఇతర శబ్దాల రికార్డ్ చేస్తుంది. పేరుకే బ్లాక్ బాక్స్ కానీ.. ఇది బ్రైట్ ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. ఇది ఏ తీవ్రమైన ప్రమాదాన్నైనా, ఎంతటి అగ్నినైనా తట్టుకొనేలా రూపుదిద్దుకున్న క్రాష్ రెసిస్టెంట్ డివైజ్. ప్రతి కమర్షియల్ విమానంలో ఇలాంటివి రెండు రికార్డర్లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్.. ఇది విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, నియంత్రణ ఉపరితలాల కదలికలు వంటి టెక్నికల్ డేటాను రికార్డ్ చేస్తుంది.

రెండోది కాక్‌పిట్ వాయిస్ రికార్డర్.. ఇది కాక్‌పిట్‌లో పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో వారి కమ్యూనికేషన్లు, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. ఈ రెండు రికార్డర్‌లలోని డేటాను విశ్లేషించి ప్రమాదానికి ముందు విమానంలో ఏమి జరిగిందో పైలట్లు ఏమి మాట్లాడారో ఏ వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు. బ్లాక్ బాక్స్ ..ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను జరగకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. అందుకే బ్లాక్ బాక్స్ విమాన ప్రమాదంలో కారణాలను గుర్తించేందుకు కీలక సాక్ష్యం. ఈ బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడం సులువు అవుతుంది.

బ్లాక్ బాక్స్ లభించాక ఏం చేస్తారు?

ప్రస్తుతం బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. రెస్క్యూ పూర్తయిన వెంటనే దాన్ని వెలికితీస్తారు. అది దొరికిన తరువాత బ్లాక్ బాక్స్‌ను డిజీసీఏ లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ మెమొరీ డేటా డీకోడ్ చేస్తారు. ఆడియో, డేటాను తీస్తారు. రాడార్, ATC లాగ్స్‌తో అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజులు నుంచి వారం వరకు పడవచ్చు.

గతంలో బ్లాక్ బాక్స్ ద్వారానే దర్యాప్తు

జర్మన్‌వింగ్స్‌ విమాన ప్రమాదం (2015), మలేసియా ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాద కేసులు, 2020 కోజికోడ్ విమాన ప్రమాదం దర్యాప్తుల్లో బ్లాక్ బాక్స్ కీలక ఆధారమైంది. అప్పట్లో కూడా పైలట్ నిర్ణయాలు, రన్‌వే పరిస్థితులు అన్నీ దీని ద్వారానే తెలిశాయి. సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లోనూ, బ్లాక్ బాక్స్‌ ద్వారానే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి