AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Box: బ్లాక్‌ బాక్స్‌ ఆరెంజ్‌ కలర్‌లో ఎందుకు ఉంటుంది? విమానం వెనుక భాగంలో ఎందుకు అమరుస్తారు?

Black Box: బ్లాక్ బాక్స్ వెనక భాగంలోనే అమరుస్తారు. ఇలా వెనుక భాగంలో అమర్చేందుకు కూడా కారణం ఉంది. ఈ బ్లాక్ బాక్స్‌ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా..

Black Box: బ్లాక్‌ బాక్స్‌ ఆరెంజ్‌ కలర్‌లో ఎందుకు ఉంటుంది? విమానం వెనుక భాగంలో ఎందుకు అమరుస్తారు?
Subhash Goud
|

Updated on: Jun 13, 2025 | 1:19 PM

Share

విమానంలో జరిగే ప్రతీది బ్లాక్‌ బాక్స్‌లో రికార్డ్ రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు.. పైలట్ల అనౌన్స్‌మెంట్, ప్రైవేట్‌ సంభాషణలు రికార్డ్ అవుతాయి. సాధారణంగా విమానాల్లోని బ్లాక్ బాక్స్‌ అనేది కంప్యూటర్ హార్డ్‌డిస్క్ లాంటిది. విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్. అయితే ఈ బ్లాక్ బాక్స్ అరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ కలర్‌ ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక కారణం కూడా ఉంది. సాధారణంగా విమాన ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగిన సమయంలో అన్ని కూడా కాలిబూడిదవుతుంటాయి. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్‌ బాక్స్‌ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే అందుకే బ్లాక్ బాక్స్‌కు ఆరెంజ్ కలర్ ఉంటుందని ఏవియేషన్‌ అధికారుల వివరాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ బాక్స్‌ విమానం వెనుక భాగంలో అమరుస్తారు.

ఈ బ్లాక్‌ బాక్స్‌ను విమానం వెనుక భాగంలో ఎందుకు అమరుస్తారు?

బ్లాక్ బాక్స్ వెనక భాగంలోనే అమరుస్తారు. ఇలా వెనుక భాగంలో అమర్చేందుకు కూడా కారణం ఉంది. ఈ బ్లాక్ బాక్స్‌ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా తొలగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే దీనిని డిజైన్‌ చేస్తారు. ఒక వేళ రాడర్‌ సిగ్నల్స్‌ అందని సమయంలో కూడా బ్లాక్‌ బాక్స్‌ మాత్రం పని చేస్తూనే ఉంటుంది. విమానం ప్రమాద సమయంలో అందులో ఉండే పైలట్‌, ఇతర ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు. పైలట్‌ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి సహాయం కోరాడు. తదితర విషయాలు ఇందులో రికార్డు అవుతుంటాయి.

ఇవి కూడా చదవండి

అయితే ఈ బ్లాక్‌ బాక్స్‌ వెనుకవైపు ఎందుకు అమరుస్తారంటే.. ఇక్కడ అమర్చడం వల్ల చాలా సురక్షితమని విమానయాన నిపుణులు చెబుతున్నారు. విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనక భాగం పెద్దగా ధ్వసం కాదు అందుకే ఇక్కడే బ్లాక్ బాక్స్‌ను అమరుస్తారని నిపుణుల ద్వారా తెలుస్తోంది. అయితే విమానంలో ఎంతో ఎంతో మంది ఉంటారు కనుక ప్రతి విమానంలో ఇలాంటి బ్లాక్‌ బాక్స్‌ ఉండాలని విమానాయాన రంగంలో ఒక చట్టంగా రూపొందించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారణాలు సులభంగా తెలుసుకోవచ్చనే దానిపై దీనిని ప్రతి విమానంలో అమర్చడం తప్పనిసరి చేసింది విమానయాన రంగం.

బ్లాక్‌ బాక్స్‌లో రెండు కీలక పరికరాలు:

విమానయాన రంగ నిపుణుల వివరాల ప్రకారం.. విమానంలో అమర్చే ఈ బ్లాక్‌ బాక్స్‌లో రెండు కీలక పరికరాలు ఉంటాయి. ఒకటి ఫ్లయిడ్‌ డేటా రికార్డ్‌ (ఎఫ్‌డీఆర్‌), మరొకటి కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌). ఫ్లయిడ్‌ డేటా రికార్డర్‌లో విమానంకు సంబంధించి పూర్తి వివరాలు రికర్డ్‌ అయి ఉంటాయి. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది..? ఎంత ఇంధనం ఉంది? ఇంజిన్‌కు సంబంధించిన విషయాలు పారామీటర్ల సమాచారం ఇందులో రికార్డు అయి ఉంటాయి. అంతేకాకుండా విమాన కదలికలను ఎప్పటికప్పుడు రికార్డు చేసి ఉంచుతుంది. విమాన పైలట్‌ ల్యాండింగ్‌ గేర్‌ ఎప్పుడు వేశారు.. గేర్‌ వేయడంలో ఏమైనా జాప్యం జరిగిందా? అనే విషయాలు తెలుస్తాయి.

ఇక కాక్‌పిట్‌ విషయానికొస్తే ఇందులో విమాన పైలట్‌ వాయిస్‌ రికార్డు అవుతుంటుంది. పైలట్‌ సంభాషణ నుంచి ఏటీసీతో మాట్లాడిన ప్రతి విషయం కూడా రికార్డు చేస్తుంది. అందుకే విమాన ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు చేసే అధికారులు దీనినే ఆధారంగా తీసుకుంటారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా వివరాలు తెలుసుకున్నా పూర్తి దర్యాప్తు కోసం బ్లాక్‌బాక్స్‌ను ఆధారంగా చేసుకుంటారు. దీని ద్వారా అసలు విషయాలు బయటకు వస్తాయి.

ఇది కూడా చదవండి: Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమానానికి ఇది ఎందుకంత ముఖ్యం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..