Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Schools Holidays: ఈ ఏడాదిలో పాఠశాలలకు 83 రోజుల పాటు సెలవులు.. ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల!

Schools Holidays: సాధారణంగా వేసవిలో విద్యాసంస్ధలకు సెలవులు వస్తాయి. కానీ కొన్నేళ్ళుగా వర్షాకాలంలో కూడా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపడుతుంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా పాఠశాలలకు..

Schools Holidays: ఈ ఏడాదిలో పాఠశాలలకు 83 రోజుల పాటు సెలవులు.. ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల!
Subhash Goud
|

Updated on: Jun 12, 2025 | 1:36 PM

Share

ఏపీ విద్యాశాఖ విద్యాసంస్థలకు సంబంధించి సెలవుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు మొత్తం 83 సెలవులు ఉండనున్నాయని ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. అయితే మొత్తం 233 పాఠశాల పని దినాలలో ముఖ్యమైన పండుగలకు సంబంధించిన హాలిడేస్‌ ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందుగానే ఈ హాలిడేస్‌లను గమనించాలని సూచించింది.

సాక్షి ఎడ్యుకేష‌న్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు మొత్తం 83 సెలవులు ఉండనున్నాయి. మొత్తం 233 పాఠశాల పని దినాలు ఉండగా, వీటిలో ముఖ్యమైన పండుగలకు సంబంధించిన సెలవులు కూడా ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సెలవులను ముందుగానే గమనించుకోవాలి.

దసరా, సంక్రాంతి సెలవులు:

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. సాధారణ పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉండనున్నాయి. అలాగే సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ నుంచి18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వేసవి ఎండలనే దృష్టిలో ఉంచుకుని మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

వర్షాకాలంలోనూ సెలవులు

సాధారణంగా వేసవిలో విద్యాసంస్ధలకు సెలవులు వస్తాయి. కానీ కొన్నేళ్ళుగా వర్షాకాలంలో కూడా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపడుతుంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తుంటుంది. అయితే ఈ సెలవులు ఒక్కోసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు వర్తిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటాయే ఆ ప్రాంతాలకు మాత్రమే పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తుంటారు.

మైనారిటీ స్కూళ్లకు ప్రత్యేక సెలవులు:

మైనారిటీ పాఠశాలలకు ప్రత్యేక సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో కొన్ని మార్పులు ఉండనున్నాయి.

  • దసరా సెలవులు: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు
  • క్రిస్మస్ సెలవులు: డిసెంబర్ 21 నుంచి 28 వరకు
  • సంక్రాంతి సెలవులు: జనవరి 10 నుంచి 15 వరకు
  • ఈ సెలవుల షెడ్యూల్‌ అన్ని విద్యాసంస్థలు పాటించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణం ఎంటి..?
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడానికి కారణం ఎంటి..?
చెట్టు లేదా ముఖం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి..
చెట్టు లేదా ముఖం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోండి..
బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో స్ట్రీమింగ్
బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో స్ట్రీమింగ్
స్త్రీలకు బెస్ట్ ఆసనాలు ఇవే గర్భాశయ బలంతో సహా ఎన్ని ప్రయోజనాలంటే
స్త్రీలకు బెస్ట్ ఆసనాలు ఇవే గర్భాశయ బలంతో సహా ఎన్ని ప్రయోజనాలంటే
ఇంటర్‌ పాసైన వారికి భలేచాన్స్.. ICF ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు!
ఇంటర్‌ పాసైన వారికి భలేచాన్స్.. ICF ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాలు!
లార్డ్స్ టెస్ట్ ఓటమి.. డబ్యూటీసీలో భారత్ బెండుతీసిన ఇంగ్లాండ్..
లార్డ్స్ టెస్ట్ ఓటమి.. డబ్యూటీసీలో భారత్ బెండుతీసిన ఇంగ్లాండ్..
ఇవి ట్యాబ్లెట్స్ కాదు.. ప్రాణాలు తీసే కిల్లర్స్.. ఎంత డేంజరో
ఇవి ట్యాబ్లెట్స్ కాదు.. ప్రాణాలు తీసే కిల్లర్స్.. ఎంత డేంజరో
మూడేళ్ళ రవితేజ చుట్టూ తిరిగా..! ఆయన చంపేస్తా అన్నారు..
మూడేళ్ళ రవితేజ చుట్టూ తిరిగా..! ఆయన చంపేస్తా అన్నారు..
తప్పు చేసినా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడని రాశులు ఇవే..
తప్పు చేసినా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడని రాశులు ఇవే..
అతను అవుట్‌ కాగానే గెలుపు మాదే అనిపించింది!
అతను అవుట్‌ కాగానే గెలుపు మాదే అనిపించింది!