Perni Nani: నా పరిస్థితి ఏ పగోడికి కూడా రాకూడదు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..
‘‘నా పరిస్థితి ఏ పగోడికి కూడా రాకూడదు.. మీ టైం నడుస్తుంది.. మాకూ ఓ రోజు వస్తుంది’’.. అంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్నినాని ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘నా పరిస్థితి ఏ పగోడికి కూడా రాకూడదు.. మీ టైం నడుస్తుంది.. మాకూ ఓ రోజు వస్తుంది’’.. అంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్నినాని ఈ వ్యాఖ్యలు చేశారు. మాయమాటలతో కూటమికి అధికారంలోకి వచ్చిందని పేర్ని నాని పేర్కొన్నారు. వైస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. తన మీద, తన భార్య మీద రేషన్ బియ్యం కేసు పెట్టారంటూ పేర్ని నాని తెలిపారు. రూ.1.80 కోట్లు కట్టాలన్నారు.. రూ.కోటి కట్టినా క్రిమినల్ కేసు పెట్టారన్నారు. తన పరిస్థితి ఏ పగోడికి కూడా రాకూడదని.. మీ టైం నడుస్తుంది.. మాకూ ఓ రోజు వస్తుందంటూ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్నోళ్లు భార్యల పేరుతో బిజినెస్‌లు పెట్టొద్దు అంటూ సూచించారు.
అయితే.. తానెప్పుడూ తప్పు చేయనని, ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వనని మాజీమంత్రి పేర్నినాని వివరించారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదంటూ పేర్ని నాని పేర్కొన్నారు. దేనికైనా సిద్ధమంటూ మంత్రి కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు. మచిలీపట్నంలో అభివృద్ధి పనులు తన హయాంలో జరగటంతో మంత్రి కళ్లల్లో ఆనందం లేదన్నారు పేర్నినాని. అందుకే తన అరెస్ట్‌తో కొల్లు రవీంద్ర ఆ ఆనందం పొందాలనుకుంటున్నారని .. అయినా భయపడనని మాజీ మంత్రి పేర్కొన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
